నోరు జారిన పాపానికి..!

సీనియర్‌ నటి తులసి ఇటీవల మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ అధ్యక్షుడు శివాజీ రాజాపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక వారం రోజులు సోషల్‌ మీడియాలో దుమారంను రేపాయి. తాను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శంకరాభరణం అవార్డు వేడుకకు మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ అధ్యక్షుడి హోదాతో నటీనటులు ఎవరు కూడా రాకుండా శివాజీ రాజా చేశాడు అంటూ తులసి విమర్శలు చేసింది. తాను చేస్తున్న అవార్డు వేడుకను మరో వ్యక్తితో మా అధ్యక్షుడు అయిన శివాజీ రాజా చెడగొట్టే ప్రయత్నం చేశాడు. శివాజీ రాజా ఒక జోకర్‌, పదవిని పట్టుకుని వేలాడే రకం అంటూ తులసి వ్యాఖ్యలు చేశారు.

శివాజీ రాజాపై తులసి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త టర్న్‌ తీసుకున్నాయి. తనపై ఆరోపణలు చేయడమే కాకుండా తన పరువుకు బంగం వాటిల్లే మాదిరిగా మాట్లాడినందుకు శివాజీ రాజా ఆమెకు లీగల్‌ నోటీసులు పంపించడం జరిగింది. లీగల్‌ నోటీసులకు తులసి సమాధానం ఇవ్వాల్సి ఉంది. శివాజీ రాజాను ఆమె దూషించినందుకు గాను పోలీసులు కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మొత్తానికి తులసి నోరు జారిన పాపానికి ఇప్పుడు కష్టల్లో కురుకు పోతుంది. ఇంతకు శివాజీ రాజాకు ఈమెకు మద్య అసలు గొడవ ఏంటో మాత్రం తెలియరావడం లేదు. వీరిద్దరి వ్యక్తిగత గొడవ కాస్త ఇండస్ట్రీ గొడవగా మారిపోయిందని సినీ వర్గాల వారు కొందరు అంటున్నారు. మా అధ్యక్షుడి హోదాలో ఉండి చిల్లగా వ్యవహరిస్తున్నాడు అంటూ శివాజీ రాజాపై కొందరు విమర్శలు చేస్తున్నారు.

To Top

Send this to a friend