ఎంత మంది ఉంటారు ఇలా..?

తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. తమకంటూ ఒక ప్రత్యేక స్థానంను ఏర్పర్చుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో ఒక్కడు ఆర్‌ నారాయణ మూర్తి. ఈయన తెరకెక్కించిన పేదల సినిమాలు సాదారణ జనాలకు, ప్రేక్షకులకు మనస్సుకు నచ్చే సినిమాలుగా నిలుస్తాయి. ప్రతి సినిమా కూడా ఒక సామాజిక సమస్యపై అంశంపై తెరక్కెస్తూ ఉంటాడు. ఆర్‌ నారాయణ మూర్తి ఉద్యమ సినిమాలు తీస్తాడు కనుక ఆయనకు ఎర్రన్న అనే పేరు కూడా ఉంది.

ఒక సామాన్య కుటుంబం నుండి సినిమా పరిశ్రమకు వచ్చి, తాను నమ్ముకున్న సినిమా పరిశ్రమలో కష్ట నష్టాలను ఓర్చుకుని కొనసాగుతూ వస్తున్నాడు. కమర్షియల్‌ సినిమాల్లో అవకాశం వచ్చినా కూడా పెద్దగా ఆసక్తి చూపించని ఈ ఎర్ర సినిమాల హీరోకు చాలా కాలంగా రాజకీయాల్లోకి నాయకులు ఆహ్వానం పుకుతున్నారట. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆర్‌ నారాయణ మూర్తి మాట్లాడుతూ మూడు సార్లు తనకు టీడీపీ ఎంపీ సీటును ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.

టీడీపీతో పాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా తనను వారి పాత్రలోకి ఆహ్వానించారని చెప్పుకొచ్చాడు. తాజాగా మరో పార్టీ కూడా తనను ఆహ్వానించినట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే తనకు సినిమాలు అంటేనే పిచ్చి, రాజకీయాల్లోకి వెళ్తే 24 గంటల పాటు ప్రజల్లోకి అందుబాటులో ఉండాలి అనేది తన ఉద్దేశ్యం. సినిమాలు చేసుకుంటూ రాజకీయం చేయమంటే నాకు ఇష్టం ఉండదు. రెండు పడవల మీద ప్రయాణం నాకు ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఎంత మంది ఇలా వచ్చిన అవకాశాలను వదులుకుంటారు చెప్పండి. అందుకే నారాయణమూర్తిని రీల్‌ హీరోగానే కాకుండా రియల్‌ హీరోగా కూడా ఆయన అభిమానులు ఆరాధిస్తారు.

To Top

Send this to a friend