అమ్మకానికి అప్పుడు మాటీవీ.. ఇప్పుడు టీవీ9

తెలుగు ఎంటర్ టైన్ మెంట్ చానళ్లలో మాటీవీ ఓ సంచలనం. మాటీవీని తెలుగు అగ్రహీరోలు నాగార్జున, చిరంజీవి, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ లు పది కోట్ల పెట్టుబడిలోపే పెట్టి మొదలు పెట్టారు. అనంతరం తెలుగు బుల్లితెరపై మాటీవీ మొదటి స్థానానికి చేరింది. నంబర్ 1గా కొనసాగుతుండడంతో మాటీవీకి కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చి కొనేందుకు స్టార్ టీవీ యాజమాన్యం ముందుకువచ్చింది. దీంతో పదుల సంఖ్యలోనే పెట్టుబడి పెట్టిన చిరంజీవి, నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ లు అమ్మేయడానికి ఒప్పుకున్నారు. అలా దాదాపు 2వేల కోట్లకు మాటీవీ అమ్ముడుపోయింది. చిరు, నాగ్, ప్రసాద్ లకు తలా 500 కోట్లకు పైగా వచ్చాయని అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి.

ఇప్పుడు ఇక అదే ఫార్ములాను అప్లై చేస్తున్నారు టీవీ9 యాజమాన్యం. ప్రస్తుతం టీవీ9లో వ్యాపారవేత్త శ్రీనిరాజుకు 80శాతం వాటా ఉంది. ఇరవై శాతం పలువురి చేతిలో ఉంది. ఇందులోనే టీవీ9 సీఈవో రవిప్రకాశ్ కు 10శాతంలోపే కూడా వాటా ఉంది. టీవీ9ను దాదాపు 1000 కోట్లకు అమ్మేందుకు శ్రీనిరాజు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

టీవీ9ను విలువ కట్టేందుకు అంతర్జాతీయ సంస్థలకు అప్పగించారు. ఆ పని పూర్తికాగానే వరల్డ్ వైడ్ గా టీవీ9 అమ్మకానికి బిడ్ లు వేస్తారట.. ప్రస్తుతం టీవీ9కు తెలుగుతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో , అమెరికాలో కూడా చానల్ ఉంది. వీటన్నింటిని కలిపి 1000 కోట్లకు అమ్మాలని ప్రయత్నిస్తున్నారు. టీవీ9ను సొంతం చేసుకోవడానికి రిలయన్స్, స్టార్ సంస్థలు సహా దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు సిద్ధమైనట్టు సమాచారం.

To Top

Send this to a friend