రైతులతో పెట్టుకొని నాడు చంద్రబాబు.. నేడు కేసీఆర్..


రైతు రాజ్యం.. రామ రాజ్యం.. రైతులకు ఉచిత ఎరువులు, కరెంట్.. ఎన్ని ఇచ్చినా కేసీఆర్ ప్రభుత్వానికి ఇది మాయని మచ్చ.. పోలీసులు తెలిసి చేశారో తెలియక చేశారో కానీ ప్రతిపక్షాలకు ఒక బలమైన ఆయుధాన్ని ఇచ్చారు. అది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని దారుణంగా డ్యామేజ్ చేస్తోంది. అన్నం పెట్టే రైతులను సంకెళ్లు వేసి ఖమ్మంలో కోర్టు కు తీసుకురావడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది.

*సంకెళ్ల ఫొటో కేసీఆర్ కొంప ముంచింది..
తప్పు ఎవరు చేసినా అంతిమంగా అది రాజ్య పాలకుడికే చెందుతుంది. రైతులకు సంకెళ్లు వేయమని పై అధికారులు, కేసీఆర్ చెప్పకపోవచ్చు. కానీ కింది స్థాయి పోలీసు అధికారులు విచక్షణ మరిచి చేసిన తప్పు కేసీఆర్ ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. సోషల్, వెబ్ , ప్రింట్ మీడియాలో రైతుకు సంకెళ్లు పేరిట విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ ఒక్క ఫొటో తో రైతుల్లో , ప్రజల్లో కేసీఆర్ పై ఉన్న నమ్మకాన్ని పలుచన చేస్తోంది.

*ఏకి పారేస్తున్నారు..
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదు.. రైతులకు సంకెళ్లు వేసి తరలించిన పోలీసులను సస్పెండ్ చేసి విచారణకు మంత్రి తుమ్మల ఆదేశించారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు. అయినా బలమైన సోషల్ మీడియాలో ఈ వార్త దావానంలా వ్యాపిస్తోంది. జర్నలిస్టులు, మీడియా ఈ విషయాన్ని సాధారణంగానే ప్రచురిస్తున్న సోషల్ మీడియాలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు..

*చంద్రబాబును గుర్తు తెచ్చుకో కేసీఆర్..
2004 కు ముందు పరిస్థితి. ఎవరిని టచ్ చేయకూడదో వారినే టచ్ చేసి చంద్రబాబు అధికారాన్ని పోగొట్టుకున్నాడు. కరెంట్ చౌర్యం పేరిట గతంలో చంద్రబాబు రైతులపై కేసులు పెట్టించాడు. హైదరాబాద్ లో రైతులు చేసిన ఉద్యమాన్ని గుర్రాలతో తొక్కించి లాఠీలతో కొట్టించి అణిచివేశాడు. కొందరి మరణానికి కారణమయ్యాడు. ఆ ప్రభావం చంద్రబాబును దాదాపు రెండు దఫాలు అధికారానికి దూరం చేసింది. రైతులతో పెట్టుకుంటే ఏమవుతుందోననడానికి చంద్రబాబు ఉదంతమే పెద్ద ఉదాహరణ.. అంతటి బలమైన నేపథ్యాన్ని కేసీఆర్ గుర్తుతెచ్చుకొని ఇప్పటికైనా రైతులతో పెట్టుకోకుంటే మంచిదని అంటున్నారు విశ్లేషకులు..

To Top

Send this to a friend