థియేటరే బుక్ చేసిన కలెక్టర్


బాహుబలి ఫీవర్ మొదలైంది. పీక్ స్టేజ్ కి చేరుకుంది. ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమా కోసం జనం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..’ ఇప్పుడు ఎవర్ని కదిలించినా మెదిలే మొదటి ప్రశ్న ఇదీ. ఈ విషయం తెలుసుకునేందుకు సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు.. సగటు అభిమాని నుంచి ఉన్నతాధికారుల వరకు అంతా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి చూసేందుకు ఓ వైపు టికెట్ల వేట మొదలైంది.. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. టికెట్ ధర ఎంతయినా ఫర్లేదు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అన్న సీక్రేట్ తెలుసుకోవాలని ఫిక్సయ్యారు.

బాహుబలి మేనియా అధికారులను తాకింది. తెలంగాణ ఐఏఎస్‌‌లు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రాపాలి 28న హన్మకొండలోని ఏషియన్ శ్రీదేవి థియేటర్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం మొత్తం 500 టికెట్లు కొనుగోలు చేశారు. ఇప్పుడీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్పెషల్ షోకు ఎవరికి ఇన్విటేషన్ దక్కుతుందా అన్న చర్చా వినిపిస్తోంది.

కలెక్టర్‌‌ అమ్రాపాలికి బెస్ట్ అడ్మినిస్ట్రేటర్‌‌ గా పేరుంది. సమస్య ఎలాంటిదైనా తనదైన స్టయిల్‌లో పరిష్కరిస్తుంటారు. వృత్తిపరంగా ఎంత కఠినంగా వ్యవహరిస్తారో మనిషిగా అంత సాఫ్ట్‌‌గా ఉంటారని వరంగల్ జనం అంటుంటారు. కిందిస్థాయి అధికారులను ప్రోత్సహిస్తూ, ఉత్తేజపరుస్తుంటారు. అయితే ఈ షోకి అధికారులను కూడా ఆహ్వానిస్తారా అనే చర్చ జరుగుతోంది.

అయితే అమ్రాపాలి టికెట్ల బుకింగ్ వెనుక కింది స్థాయి అధికారుల ప్రోత్సాహం ఉన్నట్టు తెలిసింది. కలెక్టరేట్ లోని అధికారులు, జిల్లాలోని ప్రధాన అధికారులందరూ బాహుబలిని చూద్దామని కలెక్టర్ అమ్రాపాలి వద్ద ప్రస్తావించారట.. దీనికి ఆమె సై అని టికెట్లు బుక్ చేయించారని సమాచారం. స్థానిక నాయకులకు తన స్నేహితులతోపాటు కలెక్టరేట్ అధికారుల కుటుంబాలకు ఆమ్రాపాలి ఈ స్పెషల్ షోకు ఆహ్వానం పంపనున్నారని తెలుస్తోంది. ఓ కలెక్టర్ ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఇంతలా ఆసక్తి చూపుతుంటే సగటు అభిమాని పరిస్థితి ఏంటా అని అంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

To Top

Send this to a friend