తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్..


ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు రొజుకకటి చొప్పున మార్కెట్లోకి కొత్తగా వచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. చైనా నుంచి అయితే దిగ్గజ కంపెనీలన్నీ ఇండియాలో ల్యాండ్ అయ్యి విశేష ప్రచారంతో జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వీవో, ఒప్పో, లెనోవో, గ్జియోమీ రెడ్ మీ లాంటి కంపెనీల ఫోన్లకు వినియోగదారుల ఆదరణ కూడా బాగానే ఉంది. ఇందులో మధ్యతరగతి స్థాయిలో అందరిని మెప్పించే అద్భుత ఫీచర్లు ఉండి చవకైన ఫోన్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. జనం కూడా ఆ ఫోన్లకే ఎగబడుతున్నారు.. అవేంటో చూద్దాం..

* గ్జియోమీ రెడ్ మీ, 4A
గ్జియోమీ రెడ్ మీ ఫోన్లు ప్రస్తుతం హాట్ హాట్ గా అమ్ముడుపోతున్నాయి. వివిధ షోరూంలో ఈ ఫోన్ ఆర్డర్ కోసం వెళితే దొరకని పరిస్థితి నెలకొంది. రెడ్ మి 4A ఫోన్ కోసం అయితే గడిచిన రెండు ఆదివారాల్లో జనం ఆన్ లైన్లో ఎగబడ్డారు. దీని ధర ఆన్ లైన్ కేవలం 5999గా కంపెనీ పేర్కొంది. వారానికి 15 లక్షల ఫోన్లు ఇవి హాట్ కేకులా అమ్ముడుపోతున్నాయి. తక్కువ ధర కలిగి 30 వేల సామ్ సంగ్ ఫోన్ కు ఉండే ఫీచర్లు కలిగి ఉండడంతో ఈ ఫోన్లకోసం ఎగబడుతున్నారు. అలాగే రెడ్ మి నోట్ 4కు కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. నోట్ ఫోర్ ఇన్ బిల్ట్ మెమరీ 64,32 జీబీలుగా ఉండడంతో జనం ఎగబడుతున్నారు.

*గ్జియోమీ రెడ్ మీ 4A ఫీచర్లు..
-5 inch Full HD Display
-2GB RAM
-16 GB ROM
-1.4 ghj 425Qualcomm Snapdragon
-3000 mAh Battery
-13/5 mp cameras

*గ్జియోమీ రెడ్ మీ నోట్ 4 ఫీచర్లు..
– 4 GB RAM
– 64 GB ROM Expandable Upto 128 GB
-5.5 inch Full HD Display
-13MP Primary Camera , 5MP Front
-4100 mAh Li-Polymer Battery
– Qualcomm Snapdragon 625 64-bit Processor

* లెనోవో k6 power
రెడ్ మీ నోట్ 4 ఫీచర్లు ఉన్న మరో ఫోన్ లెనోవో కే6 పవర్.. ఈ ఫోన్ కూడా ఫ్లిప్ కార్ట్ కేవలం పదివేలకే అందుబాటులో ఉంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వడం దీని ప్రత్యేకథ..

k6 power ఫీచర్లు..
– 3 GB RAM
-32 GB ROM Expandable Upto 128 GB
– 5 inch Full HD Display
– 13MP Primary Camera , 8MP Front
-4000 mAh Li-Polymer Battery
– Qualcomm Snapdragon 430 Processor

*మైక్రోమ్యాక్స్ ఎవోక్ వపర్
ఈ ఫోన్ అచ్చం లెనోవా కే6 పవర్ మాదిరే ఉంటుంది. కానీ కొన్ని తక్కువ ఫీచర్లు న్నాయి. 2జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ.. 8ఎంపీ /5 ఎంపీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. బ్యాటరీ 4000ఎంఏహెచ్ గా ఉంది. ప్రాసెసర్ కూడా ఓ మాదిరిదే..

ఎవోక్ పవర్ ఫీచర్లు..
– 2 GB RAM
– 16 GB ROM
-Expandable Upto 32 GB
– 5 inch HD Display
– 8MP Primary Camera
– 5MP Front
– 4000 mAh Li-Ion Polymer Battery
– MT6737 Processor

To Top

Send this to a friend