విలువలు వదిలేసిన తెలుగు మీడియా

మీడియా ని ఫోర్త్ ఎస్టేట్ అని,ప్రజాస్వామ్యానికి ఒక మూల స్థంభం అని అంటారు.

ఈ రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీకి సొంత మీడియా ఒక ప్రాధమిక అవసరం గా మారిపోయింది.

ముఖంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా ఎక్కువ శాతం టీడీపీ కి కొమ్ముకాస్తున్నది. అలాగే ఆ మీడియా కి టీడీపీ ప్రభుత్వం నుంచి ఆర్ధిక ప్రయోజనాలు కూడా భారీగానే చేకూరాయి అంటారు.

నిజానికి చంద్రబాబు నాయుడు కి రాజకీయ గురువు గా ఒక మీడియా యజమానిని భావిస్తారు.

✡ ఇక ఈ మీడియా వ్యవహార శైలి పరిశీలిస్తే టీవీ డిబేట్ లలో పక్ష పాత వైఖరి తో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటారు.టీడీపీ అధికార ప్రతినిధులకు అనుకూలం గా యాంకర్లు వ్యవహరిస్తూ,వారికి ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు.
అలాగే డిబేట్ లలో రాజకీయ విశ్లేషకులుగా ఉండేవారు సైతం తటస్థంగా ఉండకుండా , టీడీపీ అనుకూల వైఖరితో ఉంటారు.

✡ టీడీపీ అధికార ప్రతినిధి గా నియామకం పొందిన వారికి మంచి శిక్షణ ఇస్తారు.అలాగే నిరంతరం వారికి ప్రభుత్వ పథకాలు,తాజా రాజకీయ అంశాలపై అవగాహన కలిగించే శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.

✡ బీజేపీలో కూడా అధికార ప్రతినిధులకు శిక్షణ ఇస్తారు. ఉన్నత విద్యావంతులను మాత్రమే రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధులు గా నియమిస్తారు.

✡ కమ్యూనిస్టు పార్టీలలో ప్రత్యేక అధికార ప్రతినిధుల వ్యవస్థ పెద్దగా కనబడదు. వారి రాష్ట్ర స్థాయి నాయకులే టీవీ డిబేట్ లలో పాల్గొంటారు.

✡ జనసేన పార్టీకి కూడా సుశిక్షితులైన అధికార ప్రతినిధుల అవసరం ఉంది. కొంతమంది ఉన్నత విద్యావంతులు సమర్ధవంతంగా టీవీ డిబేట్ లలో పాల్గొంటున్నప్పటికీ కొంతమంది కి వివిధ అంశాలపై అంత అవగాహన కలిగి ఉన్నట్లుగా అనిపించడం లేదు.పార్టీ వైఖరి ని స్పష్టంగా చెప్పడంపై వాగ్ధాటి కూడా తక్కువే అనిపిస్తున్నది. ఈ విషయంలో పార్టీ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుంది.

✡ టీవీ ఛానెల్స్ కూడా టీడీపీ లో ఉన్న సమర్థులైన అధికార ప్రతినిధులను డిబేట్ లకు పిలిచి,మిగతా పార్టీలకు చెందిన కొంతమంది వాగ్ధాటి తక్కువగా ఉన్నవారిని పిలుస్తుంటారు. తద్వారా టీడీపీ వాదన పటిష్టం గా ఉన్నట్లు,మిగతా పార్టీల వాదన బలహీనంగా ఉన్నట్లు భ్రమింపచేసే ప్రయత్నం చేస్తుంటారు.

✡ వైసీపీ కి చెందిన మీడియా కూడా తక్కువేమీ తినలేదు. గాలి వార్తలు సృషించడం లో, ప్రతిపక్ష పార్టీల పై బురద చల్లడానికి తమ వంతు కృషి చేస్తుంటుంది.

✡ ఏ కుల నాయకుడిని విమర్శించడానికి ఆ కులానికి చెందిన ప్రత్యర్థిని వాడుకోవడం లో వైసీపీ మీడియా పచ్చ మీడియా ని మించిపోయింది.

✡ వైసీపీ ప్రభుత్వం టీడీపీ మీడియా ఛానెల్స్ కొన్నింటిని అనధికారికంగా నిషేధించింది.
టీడీపీ అనుకూల మీడియా ఛానెల్స్ ని కేబుల్ టీవీ లో ప్రసారం చేయకుండా కెబుల్ ఆపరేటర్ల పై ఒత్తిడి తెస్తున్నది.

✡ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ కి అనుకూలంగా వుండే మీడియా ఉద్యోగులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించి వారికి భారీ మొత్తంలో జీత భత్యాలు పారితోషకం గా అందజేస్తున్నది.
ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అనుకూల మీడియాకి ప్రభుత్వ ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు సంపాదించుకునేలాగా వ్యవహరించడం పరిపాటిగా మారింది.

✡ ఎలక్ట్రానిక్,ప్రింట్ మీడియా అది ఏదైనా ప్రజల్లోకి తమ అనుకూల పార్టీ భావజాలం ప్రజల్లోకి బలవంతంగా ఎక్కించడానికి,ప్రత్యర్ధి పార్టీ లపై బురద చల్లడానికి,ప్రత్యర్థి నాయకుల వ్యక్తిత్వహననానికీ పనిచేస్తూ దిగజారిపోయింది.

To Top

Send this to a friend