తెలుగు మహాసభల రహస్యం..

‘తెలుగు.. తెలుగు.. అని వ్యర్థ వాదములెందుకు.. మా యాస.. భాష.. తెలంగానం..’ అని ఎలుగెత్తి చాటిన ఉద్యమకారుడు కేసీఆర్.. తెలంగాణ ఉద్యమంలో తెలుగు భాషాభిమానం తెలంగాణ యాసను చంపేస్తోందని.. తెలంగాణ యాసకు ఏపీలో, తెలుగు సినిమాల్లో అవమానం ఎదురవుతోందని ఆరోపించారాయన.. మొదటినుంచి కేసీఆర్.. తెలుగు భాషాభిమానులను, కవులను, ప్రోత్సహించేవారిపై మండిపడేవారు.. మరి ఇప్పుడేంటి సడన్ గా తెలుగు మహాసభలనే కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తోంది.. దీని వెనుక అసలు కథ ఏంటి..?

తనపై వస్తున్న వ్యతిరేకతను ఎప్పటికప్పుడు డైవర్ట్ చేయడంలో కేసీఆర్ ను మించిన రాజకీయ నాయకుడు తెలంగాణలో లేరు. తెలంగాణ ప్రజల్లో ప్రస్తుతం కేసీఆర్ పాలనలో కొన్ని అంశాలపై అసహనం పెరిగిపోయింది.. మళ్ళీ అధికారం లోకి రావడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ ను అందుకోవడం కష్టమే అని కేసీఆర్ చేయించుకున్న సర్వే లోనే తేలింది. దీంతో మేల్కొన్న కేసీఆర్
రైతాంగానికి ఏమి చేయలేదు అన్న అపవాదు నుంచి బయటపడడానికి రైతులకు 4000 రూపాయల  ఉచిత ఎరువుల పథకం తెచ్చాడు.

దీంతోపాటు ఉద్యోగ కల్పన విషయంలో తెలంగాణ నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దీన్ని సరిదిద్దేందుకు కేసీఆర్ విద్యార్థి నాయకులు, ప్రస్తుత టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను రంగంలోకి దించారు. ఇటీవల ఓయూ లో జరిగిన పరిణామాలతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా కొంత మంది విద్యార్ధి సంఘం నాయకులతో రహస్య విందు సమావేశం ఏర్పాటు చేయించి టీఆర్ఎస్ యువ నేతలతో మచ్చిక చేసుకునే పనిలో పడ్డారట..

అలాగే 100 రోజులకు పైగా ధర్నాలు, దీక్షలు చేసినా పట్టించుకోని కేసీఆర్.. సడన్ గా.. ఆశా వర్కర్స్ ని ప్రగతి భవన్ కి పిలిపించుకొని మరి జీతాలు పెంచాడు. ఇలా ఒక్కొక్క అంశాన్ని ముందు వేసుకొని నష్ట నివారణ చర్యలు చేపడుతున్నాడు…

ఇక తెలుగు మహా సభలు ఎందుకు హఠాత్తుగా గుర్తుకు వచ్చింది అంటే హైదరాబాద్ లో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు రాబట్టుకునేందుకు కేసీఆర్ ప్లాన్ చేశారట.. ఆంధ్రా సెటిలర్స్ ని ఆకర్షించేందుకు ఈ తెలుగు మహాసభలను ఉపయోగించుకోవాలని ప్లాన్ చేశారట.. అందుకే ఉద్యమ సమయంలో తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అవన్నీ మరిచి ఇటు రామోజీ ని, అటు రాధా కృష్ణ ని ,ఇంకా ఎంతో మంది సినీ, రాజకీయ రంగ ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటున్నారు…

ఇక తెలుగు తల్లి, తెలంగాణ తల్లి వేరు అని.. ఉద్యమ సమయంలో ఘీంకరించిన కేసీఆర్.. నేడు ఏకంగా తెలుగు-మహా-సభలు పేరిట సభలు పెట్టడంలో ఆంతర్యం ఒకటే..

*  టి.ఆర్.యస్ ఎప్పుడు వాడుకునే ప్రాంతీయ సెంటిమెంట్ నే తెరపైకి తెచ్చి బెదిరించి మళ్ళీ ఆంధ్రుల ఓటుబ్యాంకు దక్కించుకోవాలనే తాపత్రయం.

* ఆంధ్ర కవులు, రచయితలతో పొగిడిపించుకొని, అంతా మంచి జరుగుతుంది అని, కేసిఆర్ గొప్ప సీఎం, చంద్ర బాబు కంటే మంచి పాలన చేస్తున్నాడని గొప్పగా చెప్పించుకొని ప్రజల్లోకి తీసుకెళ్లడం..

* మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించి తెలంగాణా లోని ప్రస్తుత సమస్యలను పక్క దారి పట్టించడం.

* తెలంగాణ వాడు ఎలాగో ప్రశ్నిస్తూ, అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు.. ఎక్కువ మేర ఓట్లు పక్కాగా తగ్గుతాయి కాబట్టి ఆంధ్రా సెటిలర్స్ ఓట్లను తన వైపుకు తిప్పుకోవడం..

ఇవన్నీ బేరిజు వేసుకున్నాకే.. హైదరాబాద్ లో మెజార్టీ సంఖ్యలో ఉన్న ఆంధ్రుల అభిమానాన్ని ఓట్లు గా మలుచుకునేందుకు కేసీఆర్ తెలుగు మహాసభల పేరిట కొత్త నాటకానికి తెరతీశాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

To Top

Send this to a friend