తెలుగుహీరోలు కష్టమే..

రాజమౌళి ఇప్పుడో బ్రాండ్.. రాజమౌళి ఇప్పుడు బాహుబలి సినిమా అంబాసిడర్.. ప్రస్తుతం 5 ఏళ్ల పడ్డ కష్టానికి ఫలితం వచ్చి బాహుబలి హిట్ అయ్యింది. బాహుబలితో రాజమౌళి ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యింది. అందుకే రాజమౌళితో ఓ భారీ బడ్జెట్ సినిమా తీయడానికి ఇటీవల బాలీవుడ్ ప్రొడ్యుసర్లతో పాటు, అంతర్జాతీయ ప్రొడక్షన్ హౌస్ ఫాక్స్ స్టార్ సంప్రదించినట్టు తెలిసింది. వారితో చర్చలు జరిపిన రాజమౌళి బాలీవుడ్, హాలీవుడ్ ఎంట్రీకి ఇదే సమయమని నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది.

హిందీలో బాహుబలిని రిలీజ్ చేసిన నిర్మాత కరుణ్ జోహర్ బ్యానర్ లోనే తన తరువాతి సినిమా చేయబోతున్నట్టు రాజమౌళి అనుకుంటున్నట్టు తెలిసింది. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి ఇక నుంచి సినిమాలను అదే అంతర్జాతీయ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని తీస్తానని అనుకుంటున్నాడట.. మార్కెట్ ను అందిపుచ్చుకొని దర్శకుడిగా ఎదిగేందుకు ఇదే మంచి తరుణమని అందుకే బాలీవుడ్ వేదికగా హాలీవుడ్ స్థాయి సినిమా చేయాలని రాజమౌళి ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.

అయితే రాజమౌళి తీసే సినిమాలో తెలుగు హీరోను తీసుకోవడం కష్టమే అన్న టాక్ వినిపిస్తుంది. వందల కోట్లు పెట్టే సినిమాలో దక్షిణాది తెలుగు హీరో అయితే మార్కెట్ ఉండదని.. అందుకే ఈసారి బాలీవుడ్ హీరోతోనే సినిమా చేయాలని రాజమౌళి భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రాజమౌళి కథ, కథనంపై దృష్టిసారించారు. నాన్న విజయేంద్రప్రసాద్ ఓ కథను రాస్తున్నారు. ఆ కథను బట్టి హీరోను నిర్ణయించి తన తరువాతి సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తీయబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

To Top

Send this to a friend