నంద్యాల ఎన్నిక: వైసీపీకే సినీ ఇండస్ట్రీ మద్దతు

నంద్యాల‌లో వైసీపీకి మ‌ద్ద‌తుగా సినీ అభిమానం ఉప్పొంగుతోంది. వైసీపీకే మ‌ద్ద‌తు అంటూ ప్ర‌ముఖ హీరోల అభిమానులు ముందుకు వ‌స్తున్నారు. గ‌తంలో టీడీపీకి క‌నిపించే సినీ గ్లామ‌ర్ ఇప్పుడు వైసీపీవైపు ఉన్న‌ట్లు నంద్యాల ఉప ఎన్నిక భ‌విష్య‌త్ సంకేతాల‌ను స్ప‌ష్టం చేస్తోంది.

టీడీపీ త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని సినీ హీరో.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ కోసం ఎంతగానో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆయ‌న త‌ట‌స్థ వైఖ‌రి తీసుకున్నా..ప‌వ‌న్ అభిమానుల మ‌ద్ద‌తు వైసీపీకే అంటూ ఆశ్చ‌ర్య‌పోయే విధంగా స్వీయ ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటోంది.

ఇక‌, బాల‌కృష్ణ ను ఒక రోజు ప‌ర్య‌ట‌న‌కే ప‌రిమితం చేసింది. ఆయ‌న డ‌బ్బులు పంచుతూ..కార్య‌క‌ర్త‌ల పై చేయి చేసుకోవ‌టంతో..ఆయ‌న ప్ర‌చారం వ‌ల‌న వ‌చ్చిన ఇమేజ్ కంటే సోష‌ల్ మీడియాలో డామేజ్ ఎక్కువ‌గా జ‌రిగింది.
ఇక‌, ఎవ‌రూ లేక పోవ‌టంతో..చివ‌ర‌కు వేణు మాధ‌వ్ తో టీడీపీ నంద్యాల‌లో ప్ర‌చారం చేయించుకోవాల్సి వ‌చ్చింది.

అయితే వైసీపీలో ప‌రిస్థితి భిన్నంగా క‌నిపిస్తోంది. వెండి తెర హీరోలు తెర వెనుక ఉండి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లుగా..వారి అభిమాన సంఘాలు ఒక‌రి త‌రువాత మరొక‌రు నంద్యాల‌లో జ‌న నేత పై త‌మ అభిమానం చాటుకుంటున్నారు. నంద్యాల‌లో త‌మ మ‌ద్ద‌తు వైసీపీకే అని చాటుతున్నారు.

కొద్ది రోజుల క్రితం నంద్యాల‌లోని సూప‌ర్ స్టార్‌..ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు వైసీపీ అభ్య‌ర్ధికే నంద్యాల‌లో మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. కృష్ణ సోద‌రుడు ఆదిశేష‌గిరి రావుతో సమావేశ‌మైన వారు ఈ మేర‌కు హామీ ఇచ్చారు. దీంతో.. అక్క‌డ కొత్త ఉత్సాహం క‌నిపించింది.

తాజాగా.. అక్కినేని అభిమానులు కూడా వైసీపీకే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. నంద్యాల ఉప ఎన్నిక‌లో శిల్పా మోహ‌న‌రెడ్డికి ఆలిండియా నాగార్జున ఫ్యాన్స్ అసోసియేష‌న్ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు అక్కినేని అభిమానులు అంద‌రూ శిల్పా మోహ‌న‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని అక్కినేని ఫ్యాన్స్ ఆలిండియా అధ్య‌క్షుడు నాగరాజు పిలుపునిచ్చారు. ఇప్ప‌టికే సాధార‌ణ ప్ర‌జ‌లు నంద్యాల‌లో జ‌గ‌న్ పై అభిమానం చూపిస్తున్నారు. టీపీ ఎన్ని అడ్డంకులు సృష్ట‌స్తున్నా..ఎన్ని ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నా జ‌గ‌న్ స‌భ‌ల‌కు..రోడ్ షోల‌కు త‌ర‌లి వ‌స్తున్నారు. ఇప్పుడు..సినీ హీరోల అభిమాన సంఘాలు వైసీపీ కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించటం నంద్యాల‌లో క‌లిసొచ్చే అంశం.

అయితే, ఇది నంద్యాల‌కే ప‌రిమితం అవుతుందా.. లేక ఈ అభిమానుల హీరోల మ‌ద్ద‌తు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీతో ఉంటుందా అనే గుబులు ఇప్పుడు టీడీపీలో మొద‌లైంది. కానీ, తెలుగు రాజ‌కీయాల్లో మాత్రం ఇది ఒక ట్విస్ట్ గా మిగిలి పోతుంద‌నేది సుస్ప‌ష్టం. సినీ ప్ర‌ముఖ హీరోల అభిమానులు ముందుకు వ‌చ్చి వైసీపీకి మ‌ద్ద‌తు ఇస్తున్నారంటే..అది..భ‌విష్య‌త్ ప‌రిణామాల‌కు..వైసీపీలో పెర‌గ‌నున్న సినీ గ్లామ‌ర్ కు సంకేతాలుగా విశ్లేష‌కులు భావిస్తున్నారు.
అయితే, నంద్యాల‌లో ప్ర‌స్తుతం మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న సినీ అభిమాన సంఘాల మ‌ద్ద‌తు పై మాత్రం పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇది.. వైసీపీకి మ‌రింత బ‌లంగా మారే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

To Top

Send this to a friend