తెలుగు సినిమా పీచేముడ్


తెలుగు సినిమాను బాహుబలికి ముందు.. బాహుబలి తర్వాత అని చెప్పాల్సిందే.. ఎందుకంటే బాహుబలి తర్వాత తెలుగు సినిమా ఎల్లలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకొచ్చిందీ చిత్రం. బాహుబలి తర్వాత తెలుగు సినిమాలో చారిత్రక నేపథ్యమున్న సినిమాలు పెరిగాయి. ఆ కోవలోనే బాలయ్య కూడా నడిచాడు. తన 100వ చిత్రంగా గౌతమి పుత్ర శాతకర్ణి తెరకెక్కించారు. అదీ సక్సెస్ అయ్యింది..

చారిత్రక గాథలకు డిమాండ్ పెరిగిపోయింది. తెలుగులో మొదలైన ఈ ఒరవడి తమిళ, హిందీల్లో కూడా పాకింది. ఇప్పుడు చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక తన 151వ చిత్రంగా చారిత్రక కథాంశాన్నే ఎంచుకున్నారు. చరిత్రదాచిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి’ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడీ కథా సిద్ధమవుతోంది. పరుచూరి బ్రదర్స్ తుది మెరుగులు దిద్దుతున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ చారిత్రక చిత్రాల గాథలు ఇప్పుడు తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నాయి. కొత్తతరం కథలను పక్కనపెట్టి తెలుగు సినిమా వెనక్కి వెళ్లిపోతోంది. ఎన్నో దాగివున్న గాథలు, కథలు, నవలలు తెరపైకి తీసుకొస్తున్నారు. అలాగే ఇటీవల ‘ఘాజీ’ సినిమాను కూడా తీసి విడుదల చేశారు. పాకిస్తాన్ ఆర్మీ భారత్ పై ప్రయోగించిన ఘాజీ జలాంతర్గామి కథను కళ్లకు కట్టినట్టు తీశారు. ఈ చిత్రం విమర్శకులు ప్రశంసలు అందుకుంది. తెలుగు సినిమాకు ఇప్పుడు వెనక్కి వెళ్లింది. అదీ కథల కోసం మాత్రమే.. కానీ సృజనాత్మకతలో మాత్రం చాలా ముందుకు వెళ్లింది.

To Top

Send this to a friend