బాలీవుడ్ లో గానం చేసిన తెలుగు అమ్మాయి “స్ఫూర్తి ” .

ప్రముఖ మహిళా దర్శకురాలు విజయ నిర్మల గారి వద్ద దర్శకత్వ శాఖ లో పనిచేసి , కళా తపస్వి డా . కే . విశ్వనాధ్ , హీరో రాజా , పూనమ్ బాజ్వా , ప్రధాన తారాగణం గా “వేడుక”; డా. కే . శ్రీ హరి , సాయి రామ్ శంకర్ , పార్వతి మెల్టన్ ల తో తో “యమహో…యమ..” చిత్రాలకు దర్శకత్వం వహించిన జితేంధర్. వై. కుమార్తె – “స్ఫూర్తి జితేంధర్” పదకొండు సం|| వయసు లోనే తన తండ్రి దర్శకత్వం వహించిన “యమహో…యమ..” చిత్రం లో, సంగీత దర్శకుడు భోలే సారధ్యం లో ఐటెం సాంగ్ పాడి, శభాష్ అనిపించుకుని, హీరో కళ్యాణ్ రామ్ నిర్మాత గా, సురేందర్ రెడ్డి దర్శకత్వం లో థమన్ సంగీత సారధ్యం లో, రవి తేజ హీరో గా కిక్-2 చిత్రం; పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వరుణ్ తేజ్ హీరో గా రూపొందిన “లోఫర్” చిత్రం లో సునీల్ కశ్యప్ సంగీత సారధ్యంలోను; కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన ‘ఇజమ్’ చిత్రంలోనూ అనూప్ రూబెన్స్ సంగీత సారధ్యం లో గానం చేసి 16సం|| లకే ఆశిష్ విద్యార్థి, ముకేష్ తివారి తదితరులు నటించిన, రవి సదాశివ దర్శకత్వం లో రూపొందిన “బచ్చె, కచ్చె .. సచ్చె .. ” హిందీ చిత్రం లో అమితాబ్ నటించిన సర్కార్ 3 చిత్రానికి సంగీతం అందించిన రవి శంకర్ మరియు భోలే ల సంగీత సారధ్యం లో గానం చేయడం ద్వారా తెలుగు అమ్మాయి బాలీవుడ్ చిత్రానికి గానం చేయటం చెప్పుకోదగినది . బాలల చిత్రం గా సమాజానికి సందేశాన్ని అందించే ఈ చిత్రం జూన్ 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది .
ప్రముఖ బాలీవుడ్ గాయకులు జావేద్ అలీ , యం డి . ఇఫ్రాన్ లు గానం చేసిన చిత్రం లో తను టైటిల్ ట్రాక్ పాటను గానం చేయడం తన అదృష్టాంగా భావిస్తున్నాను అని కుమారి గాయని స్ఫూర్తి జితేందర్ సంతోషం వ్యక్తం చేసారు .

మానవతా విలువల తో పిల్లల పై పెద్దల ప్రవర్తన నేటి సమాజం లో ఏ విధంగా ఉండాలి అని సందేశాత్మకంగా చైతన్యాన్ని తీసుకొచ్చే సందేశాత్మక చిత్రం గా రూపొంది గాయని గా తనకి సరైన గుర్తింపు తెచ్చే బాలీవుడ్ లో అవకాశంగా భావిస్తున్నట్టు స్ఫూర్తి జితేందర్ తెలియజేసారు .

అతి చిన్న వయసులోనే గాయని గా 2015సం|| దుబాయ్” గామా” అవార్డు ను అందుకొని , తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో తన పేరు ను నమోదు చేసుకుని కళా తపశ్వి డా. కే . విశ్వనాధ్ , ప్రముఖ నిర్మాత కే . రాఘవ , తుమ్మల ప్రసన్న కుమార్ , హీరో డా . నరేష్ , చేతుల మీదుగా ఆ అవార్డు ని అందుకోవడం తన పూర్వ జన్మ సుకృతంగా, తన ప్రతిభను మరింత పెంపొందించుకోవడానికి తార్ఖనంగా ఈ అవకాశాన్ని భావిస్తున్నట్టు కుమారి గాయని స్ఫూర్తి జితేంద్ర పేర్కొన్నారు .

To Top

Send this to a friend