ఇక టెలినార్ కస్టమర్లందరూ ఎయిర్ టెల్ లోకి..

ఎయిర్ టెల్-టెలినార్ విలీన ఒప్పందానికి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. స్టాక్ ఎక్స్చేంజ్ లలో కూడా ఎయిర్ టెల్-టెలినార్ లు విలీన ఒప్పందంపై ఆమోదం పొందాయి. దీంతో ఇక నుంచి టెలీనార్ కంపెనీ ఉండదు. ఆ కంపెనీ వినియోగదారులందరూ ఎయిర్ టెల్ వినియోగదారులుగా మారిపోతారు. ఈ దెబ్బతో ఎయిర్ టెల్ వాటా దేశంలో 35శాతానికి పెరిగిపోతోంది..

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దెబ్బకు ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్, టెలినార్ లు కుదేలయిన సంగతి తెలిసిందే.. దేశీయ టెలికాం రంగంలో ఉచిత ఆఫర్లతో దూసుకొచ్చిన జియో ఆఫర్ల ముందు ఈ కంపెనీలు ప్రకటించిన ఆఫర్లు ఎంతకు పొసగలేదు. దీంతో జియో కస్టమర్లు 10 కోట్లు దాటిపోగా.. చిన్న కంపెనీలైన టెలినార్, ఎయిర్ సెల్ లు కుదేలయ్యాయి. ఐడియా, ఎయిర్ టెల్ , వోడాఫోన్ ల ఆదాయం జియో దెబ్బకు గణనీయంగా పడిపోయింది. దీంతో ఇక విలీనం అవ్వడమే మేలని టెలినార్ ఎయిర్ టెల్ ను సంప్రదించడం.. చర్చలు జరిగి విలీనం అవ్వడం జరిగిపోయింది.. ఐడియా, వోడాఫోన్ లు కూడా విలీనం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నాయి. దీంతో జియో దెబ్బకు భారత టెలికాం పరిశ్రమలోని మిగతా ఆపరేటర్ల స్థానమే ప్రశ్నార్థకంగా తయారవుతోంది..

సెబీ కూడా ఈ ఒప్పందానికి ఆమోదం తెలపడంతో ఎయిర్ టెల్ లో టెలినార్ విలీనం అయినట్టు అయ్యింది.. ఇక టెలినార్ కస్టమర్లందరూ ఎయిర్ టెల్ లోకి త్వరలోనే చేరిపోబోతున్నారన్నమాట.

To Top

Send this to a friend