మా వ‌ల్లే వెంక‌య్య ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థి

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడుపై టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసం గ‌ళం విప్పుతున్న పిడ‌మ‌ర్తి ర‌వి తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వ‌ర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో చేపట్టిన మౌన ప్రదర్శనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ 6వ ద‌ఫా కూడా పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన కూడా ద‌ళితుల విష‌యంలో ఏబీసీడీ వర్గీకరణ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో మాదిగల ఉద్యమం త్రీవతరం అయ్యిందని పేర్కొంటూ ఈ పార్లమెంట్ సమావేశాలలో ఏ,బీ,సీ,డీ వ‌ర్గీక‌ర‌ణ‌ చేపట్టాలని పిడ‌మ‌ర్తి ర‌వి డిమాండ్ చేశారు. మాదిగల డిమాండ్లను రాజకీయం చేయవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని పిడ‌మ‌ర్తి ర‌వి కోరారు. బీజేపీ సీనియ‌ర్ నేత వెంకయ్య నాయుడు మాదిగలను ఉపయోగించుకొని ఉపరాష్ట్రపతి ప‌ద‌వికి ఎంపిక‌య్యార‌ని ఆయ‌న అన్నారు. త‌మ వ‌ల్ల ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వికి అభ్య‌ర్థిగా ఎంపిక‌యిన వెంకయ్య త‌మ జాతి డిమాండ్ చేస్తున వర్గీకరణపై స్పందించాలని కోరారు. త‌మ ముఖ్యమంత్రి అసెంబ్లీ తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపారని తెలిపారు. వర్గీకరణ చేయకపోతే తెలంగాణ‌లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని తెలిపారు. బీజేపీని నామరూపాలు లేకుండా చేస్తామ‌న్నారు.

To Top

Send this to a friend