వాహ్ తెలంగాణ.. కేసీఆర్ అన్నదే నిజమైంది..

తెలంగాణ వస్తే కటిక చీకట్లు అన్నారు. తెలంగాణ వస్తే నక్సలైట్లు పెరుగుతారన్నారు. తెలంగాణ వస్తే అభివృద్ధి జరగదన్నారు. కానీ ఇప్పుడేం ఏమైంది. తెలంగాణ వచ్చి మూడేళ్లు అయ్యింది. దేశ  వృద్ధి రేటు 8 శాతం లోపే ఉంది. కానీ 2016-17 సంవత్సరంలో తెలంగాణ వృద్ధి రేటు 17.82 శాతంగా నమోదైంది. దేశంలోనే ఏ రాష్ట్రం ఇంత వృద్ధిరేటును నమోదు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కాగ్ ఈ మేరకు లెక్కలు విడుదల చేసింది.
ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, అమ్మకం పన్నులతో పాటు ఇతర ఆదాయ మార్గాల ద్వారా గడిచిన 2015-16లో 36వేల కోట్ల ఆదాయం వచ్చింది. గడిచిన సంవత్సరం తెలంగాణ 15శాతం వృద్ది రేటు సాధించగా ఈ సంవత్సరం ఏకంగా 42వేల కోట్లకు ఆదాయం పెరిగి 17శాతం వృద్ధిరేటు నమోదైంది. దేశంలోనే పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ ల వృద్ధి రేటు 9, 7 శాతం మాత్రమే సాధించాయి. తెలంగాణ తర్వాత పశ్చిమ బెంగాల్ 17.16 శాతం వృద్ధిరేటుతో రెండో స్థానంలో ఉంది. ఏపీ 9 శాతం వృద్ధిరేటుతో 7 వ స్థానానికి పడిపోవడం గమనార్హం.
తెలంగాణ వృద్ధిరేటులో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో తాను తెలంగాణ ధనిక రాష్ట్రమని అంటే నవ్వారని.. కానీ ఈ మూడేళ్లలోనే అది నిరూపితమైందని కేసీఆర్ తెలిపారు. నోట్ల రద్దు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ తెలంగాణ ఇంత వృద్ధి రేటు సాధిస్తే వర్షాలు పడి పరిస్థితులు అనుకూలంగా ఉంటే మరింత దూసుకుపోతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
To Top

Send this to a friend