నవ్విన నాపచేనే పండింది..

అప్పుడే మూడేళ్లు గడిచాయి.. తెలంగాణ కోసం పోరాటం ఇంకా పచ్చిగానే ఉంది. దాదాపు 1200 మందికి పైగా బలిదానాలు చేశారు. ఉద్యమం కోసం విద్యార్థులు జైలు పాలయ్యారు. ఉద్యమ సేనాని కేసీఆర్ అమరదీక్షకు దిగాడు. మొత్తానికి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, ఉద్యమాల తర్వాత తెలంగాణ నాటకీయ పరిణామాల మధ్య ఏర్పడింది. పార్లమెంటు చరిత్రలోనే లైవ్ కవరేజ్ ఆపేసి.. పెప్పర్ స్ర్పేలు చల్లుకొని ఎంపీలు కొట్టుకొని ఎలాగైతేనే నవతెలంగాణ సాక్షాత్కారమైంది. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. సకలజనుల సంక్షేమం.., సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు..

*కిరణ్ అపహాస్యం.. కేసీఆర్ పట్టుదల..
ఉమ్మడి ఏపీ రాష్ట్రం చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆనాడు వెకిలినవ్వులు నవ్వాడు.. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అని నాటి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను అవహేళన చేశాడు.. తెలంగాణ వస్తే కరెంట్ కోతలు తీవ్రమవుతాయని… కారు చీకట్లు దాపురిస్తాయని కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరికలు పంపారు. కానీ నవ్విన నాపచేనే పండింది.. తెలంగాణ ఈ కష్టాలను అధిగమించింది. దూరదృష్టి గల ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ది దిశగా పరుగులు పెడుతోంది. దేశంలోనే ఏ రాష్ట్రం సాధించని వృద్ధి రేటు 17శాతానికిపైగా సాధించి నంబర్ 1 ర్యాంకు ను సాధించింది. దేశ సగటు వృద్ధి 8శాతం లోపే ఉండగా.. తెలంగాణది 17శాతం ఉండడం కేసీఆర్ పాలనకు నిదర్శనంగా మారింది.

* సంక్షేమంలో దేశంలోనే నంబర్ 1
రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంట్ .. వచ్చే ఖరీఫ్ నుంచి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తానని ఈరోజు కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు పింఛన్ల పేరిట వృద్ధులకు , ఒంటరి మహిళలకు, ఆపన్నులకు, వికలాంగులకు నెలకు 1500 పింఛన్ ఇస్తున్నారు. కళ్యాణలక్ష్మీ పేర ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆడబిడ్డల పెళ్లిళ్లకు 75వేల ఆర్థిక సాయాన్ని పెంచారు. రైతులకు ఖరీఫ్, రబీల్లో పెట్టుబడులకు రూ.8వేల ఆర్థిక సాయం చేస్తున్నారు. రాష్ట్రంలోని కోటి ఎకరాల భూమికి సాగునీరందించేందుకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. ఇందులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీలు నిర్మించి రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు పైప్ లైన్ ఉండడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ రూపొందించి సరఫరా చేస్తారు. తెలంగాణ జలహార్తిని తీసే ఈ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి.

ఇలా తెలంగాణ సంక్షేమంలో దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది. దీర్ఘదృష్టి, తెలంగాణ గురించి అన్నీ తెలిసిన కేసీఆర్ కొత్త రాష్ట్రం పగ్గాలు చేపట్టడం.. తెలంగాణకు వరంలా మారింది. అందుకే తెలంగాణలోని బడుగు, బలహీన అన్ని వర్గాల ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో అన్నీ చేస్తున్నాడు. ప్రస్తుతం దేశంలోనే జట్ స్పీడ్ లా అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ ఈ మూడో ఏడాది ఆవిర్భావ వేడుకలకు సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఈ ఉదయం 10.30కు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు.

To Top

Send this to a friend