కవిపై తెలంగాణ సర్కారు ప్రతీకారం..

తెలంగాణ కవి, గాయకుడు ఏపూరి సోమనకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీసులు సంకెళ్లు వేశారు. చేతులకు బేడీలు వేసి పోలీసు స్టేషన్ లోని లాకప్ కు కట్టేశారు. టెర్రరిస్టులను బంధించినట్లు స్టేషన్ లో బంధించారు. తిరుమలగిరి పోలీసులు ఇదంతా ఎందుకు చేశారంటే?

ఏపూరి సోమన్న గత కొంతకాలంగా తెలంగాణ సర్కారు వైఫల్యాలను, కుటంబ పాలనను తన పాట, మాట, రాతలతో ఎండగడుతున్నారు. ఆకాశమే హద్దుగా సర్కారుపై ఆయన పోరుబాట సాగిస్తున్నారు. తెలంగాణ సర్కారుకు ఆయన కంటగింపుగా మారారు. దీంతో ఆయనపై వేధింపులకు పాల్పడుతున్నారని సోమన్న బంధువులు, సన్నిహితులు చెబుతున్నారు.

ఏపూరి సోమన్న కుటుంబంలో కలహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే సతీమణి రంగంలోకి దిగారు. ఆమె చెప్పినట్లే పోలీసులు ఏపూరి సోమన్న చేతులకు ఉక్కు సంకెళ్లు వేసి లాకప్ ముందు కూర్చోబెట్టారు. తీవ్రమైన నేరాలు చేసిన వారిని కూర్చోబెట్టినట్లు అలా కూర్చోబెట్టడం పట్ల కవులు, కళాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

To Top

Send this to a friend