ఇక తెలంగాణలో పోలీస్ రోబోలు..

ఊహాలకు రెక్కలొస్తే ఎక్కడిదాకైనా ఎగరొచ్చు.. తెలంగాణ ప్రభుత్వం కోట్లు పెట్టి చేస్తున్న మేథోమథనం సత్ఫలితాలను ఇస్తోంది. మేధో ఆవిష్కరణల వేదికగా టీహబ్ మారుతోంది. అందులో తెలంగాణ పోలీస్ రోబో రూపుదిద్దుకుంటోంది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.. పోలీస్ రోబో ప్రపంచవ్యాప్తంగా దుబాయ్ లో మాత్రమే ఉంది. ఆ తర్వాత దేశంలోనే తొలిసారి పోలీస్ రోబోను హైదరాబాద్ లో తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు.

తెలంగాణ పోలీస్ రోబో తాను ఉండే చోటులోని పరిసరాల ఫొటోలు, వీడియోలు, మెస్సేజ్ లు తీసి మెయిన్ సర్వర్ కు పంపిస్తుంది. ఎవరైనా ఫిర్యాదులిచ్చినా స్వీకరిస్తుంది. అంతేకాదు పరిసరాల్లో బాంబులు, అనుమానాస్పద వస్తువులు ఉంటే గుర్తిస్తుంది. ఇది చెక్ పోస్టుల్లో ఒకే చోట ఉంచేందుకు అటు ఇటూ కదిలేందుకు కూడా రోబోలో అత్యాధునిక వ్యవస్థలు ఏర్పాటు చేశారు.

ఇంజనీరింగ్ పూర్తి చేసిన కిషన్, హర్ష, అన్వేష్ లు రెండేళ్ల క్రితం ఇదే టీహబ్ లో ‘హెచ్ బోట్స్ రోబోటిక్స్’ అనే స్టార్టప్ ను స్థాపించారు. ఇది రెండేళ్లలో వారు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. తెలంగాణ పోలీసులకు అందించేందుకు పోలీస్ రోబో డిజైన్ ను ఖరారు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ టీహబ్ లో విద్యార్థులు రూపొందించిన పోలీస్ రోబో డిజైన్ ను ఆవిష్కరించారు. డిసెంబర్ 31లోగా ఈ రోబోను పోలీస్ శాఖకు అప్పగిస్తామని విద్యార్థులు తెలిపారు. తొలిసారిగా ఈరోబోను జూబ్లీహిల్స్ చెక్ పోస్టులో ఏర్పాటు చేస్తామని జయేశ్ రంజన్ తెలిపారు. ఇలా కొన్ని నెలల విద్యార్థుల పరిశోధనకు ఫలితం దక్కి ఎనిమిది నెలల్లో తెలంగాణ పోలీస్ రోబో తయారీ పూర్తయ్యి పోలీసుల చేతికి రానుంది.

To Top

Send this to a friend