తెలంగాణ మూవి అండ్ TV ఆర్టిస్ట్స్ యునియన్ ఆధ్వర్యంలో పలువురు ఆర్టిస్ట్ లు..

తెలంగాణ మూవి అండ్ TV ఆర్టిస్ట్స్ యునియన్ ఆధ్వర్యంలో పలువురు ఆర్టిస్ట్ లు మంగళవారం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని కలిశారు. ఈ మేరకు మంత్రికి వారు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమ అసోసియేషన్ లో సుమారు 800 మంది సభ్యులు ఉన్నారని, అందరికి గుర్తింపు కార్డ్ లు, హెల్త్ కార్డ్ లను మంజూరు చేయించాలని కోరారు. అదేవిధంగా ఇండ్ల నిర్మాణానికి స్థలం కేటాయించాలని, తమ యూనియన్ ను ఫెడరేషన్ లో అనుసంధానంగా గుర్తించాలని కోరారు. అత్యధికంగా పేద కళాకారులు ఉన్నందున తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.మంత్రిని కలిసిన వారిలో యూనియన్ అధ్యక్షులు పృద్విరాజ్, ప్రధాన కార్యదర్శి జె.సైదులు, అప్పారావు, ఆశ, లక్ష్మి తదితరులు ఉన్నారు.

To Top

Send this to a friend