కేసీఆర్ సెలక్షన్ మరి.. అందుకే ఎక్కడికో వెళ్లిపోయాడు..

తెలంగాణ సీఎం కేసీఆర్ ది దాదాపు 30 ఏళ్ల పాటు ప్రజాజీవితం.. గుట్టుమట్లు, ఎత్తుపల్లాలు ఎన్నో చవిచూశారాయన.. 2001 నుంచి తెలంగాణ కోసం కొట్లాడుతున్నాడు. ఎంతో మందిని కలిశాడు. తెలంగాణ కోసం ఎన్నో మేధోమథనాలు చేశాడు. ఎలా తెలంగాణను బాగు చేయడం ఎలా అని ఆలోచించాడు. మేధావులెందరూ కేసీఆర్ వెంట నడిచారు. చివరకు తెలంగాణ సాధించిన తర్వాత మెరికల్లాంటి వారిని వివిధ విభాగాలకు బాధ్యతలు అప్పజెప్పి కేసీఆర్ తెలంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు..

తెలంగాణకు ఉన్న సమస్యలెన్నో.. కానీ వీటిలో నీటిపారుదల, విద్యుత్ లాంటి జఠిల సమస్యలు ప్రధానమైనవి. అందుకే కేసీఆర్.. ఈ రెండు విభాగాలకు తెలంగాణకు చెందిన మాజీ ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పజెప్పారు. సాధారణంగా రిటైర్ అయిన వారిని ఇందులో నియమించరు. కానీ కేసీఆర్ సలహాదారుగా.. లేదా చైర్మన్ గా ప్రత్యేక జీవోలిచ్చి వారికి అధికారం ఇచ్చారు. భారీ నీటిపారుదల శాఖ సలహాదారుగా కేంద్ర మాజీ జలవనరుల శాఖ ఇంజనీర్ గా చేసిన విద్యాసాగర్ రావుకు కేసీఆర్ బాధ్యతలు ఇచ్చారు. అలాగే తెలంగాణను పట్టిపీడిస్తున్న విద్యుత్ సమస్యను పరిష్కరించడానికి విద్యుత్ రంగంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ప్రభాకర్ రావును నియమించారు. వీరిద్దరు కూడా మేధావులే. అందుకే తెలంగాణ ఈ రెండు రంగాల్లో సంపూర్ణ విజయం సాధించింది. దీంతో నీటిపారుదల, విద్యుత్ లో తెలంగాణ రెండేళ్ల కాలంలోనే 100శాతం ఫలితాలు సాధించి దేశాన్నే ఆశ్చర్యపరిచింది..

తెలంగాణ వస్తే అంతా చీకటిమయం అని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో ఎద్దేవా చేశారు. కానీ సాధించిన తెలంగాణ చీకటి మయం కాకూడదని కేసీఆర్ కృతనిశ్చయంతో ముందుకెళ్లారు.. ప్రభాకర్ రావును తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థల సీఎండీగా చేసి ఆయన కోరినన్ని నిధులిచ్చి తెలంగాణ కరెంట్ కష్టాలను కేవలం సంవత్సరంలోగా తీర్చేలా చేశారు. ఈ నిరంతర కరెంట్ సరఫరా చేయడంలో ప్రభాకర్ రావు చేసిన కృషి ఎనలేనిది. అందుకే కేసీఆర్ ఎక్కడ టాపిక్ వచ్చిన ప్రభాకర్ రావును వేయినోళ్ల పొగుడుతుంటారు.

ఇప్పుడీ తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు ప్రతిభను కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ఆయన తెలంగాణ చీకట్లను పారద్రోలి 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తూ సాధించిన విజయాలకు ఆశ్చర్యపోయి ప్రభాకర్ రావుకు దక్షిణ భారత విద్యుత్ నియంత్రణ మండలి చైర్ పర్సన్ గా నియమించింది. ఈ పదవితో ప్రభాకర్ రావు మొత్తం దక్షిణ భారతంలోని తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు,కర్ణాటకలో విద్యుత్ వ్యవస్థపై నియంత్రణ కలిగి ఉంటారు. ఈ పదవి కోసం ఏపీ ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నం చేసినా చివరకు ఎంతో కృషి చేసినా ప్రభాకర్ రావుకే దక్కింది. ప్రభాకర్ రావుకు ఈ పదవి రావడం పట్ల కేసీఆర్ ఫోన్ చేసి మరీ ఆయన్ను అభినందించడం విశేషం.

To Top

Send this to a friend