తెలంగాణ బాహుబలి


జనం.. జనం.. పల్లె నుంచి పట్నం దాకా గులాబీ వాహనాలే వరుసకట్టాయి. వరంగల్ కు చీమలవలే దారి కట్టాయి. గులాబీ గుబాళింపులు ఓరుగల్లులో పరిమళించాయి. వరంగల్ లో టీఆర్ఎస్ నిర్వహించిన సభా ప్రాంగణమంతా జనసంద్రాన్ని తలపించింది. ఇసుకేస్తే రాలనంత జనం తరలివచ్చారు. తెలంగాణ చివర పాత మహబూబ్ నగర్ జిల్లా నలుమూలల నుంచి… ఇటు ఆదిలాబాద్ అంచుల నుంచి… ఖమ్మం ఆంధ్రా బార్డర్ నుంచి సైతం మహిళలు, రైతులు, టీఆర్ఎస్ నేతలు సభకు తరలివచ్చారు.

ఓరుగల్లు వేదికగా కేసీఆర్ పార్టీకి, ప్రజలకు దిశానిర్ధేశం చేశారు. వచ్చే 2019 ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్ దే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ నేతలను చవటలు, దద్దమ్మలుగా పోల్చారు. ప్రజల దీవెనలు ఉంటే తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని.. తెలంగాణ వ్యతిరేక శక్తులపై పోరాడి బంగారు తెలంగాణ నిర్మిస్తానని కేసీఆర్ ప్రతిన బూనారు. ఈ సందర్భంగా రైతులను దేశంలోనే సంపన్నులుగా చేస్తానని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు వరాలు కురిపించారు. తాను ఈ రెండున్నరేళ్లలో ప్రకటించిన పథకాలను వివరించారు..

ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు సమయం ఉంది. ముందస్తు ఎన్నికలొస్తాయని ఊహాగానాలు.. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన బలాన్ని, బలగాన్ని చూపించేందుకు ఈ బహిరంగ సభను వేదికగా ఎంచుకున్నారు. కాంగ్రెసోళ్లకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. గడ్డాలు, మీసాలు పెంచితే అధికారం రాదన్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికల ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో మరిన్ని పథకాలను ప్రవేశపెట్టనున్నట్టు చూచాయగా వెల్లడించారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించనున్నట్టు తెలిపారు.

బాహుబలి సినిమా ప్రభంజనంలాగానే తెలంగాణలోను కేసీఆర్ ప్రభంజనం నిన్న కొనసాగింది. కేసీఆర్ వరంగల్ సభతో తనపై ప్రజల్లో ఉన్న వత్యిరేకతను పోగొట్టుకున్నారు. తెలంగాణ జనానికి టీఆర్ఎసే ప్రత్యామ్మాయమని తెలియజెప్పారు. లక్షలమంది జనాలను తరలించారు. ఇదంతా వచ్చే ఎన్నికలకు సన్నద్ధంలో భాగమే.. ఇలా తెలంగాణ బాహుబలిగా కేసీఆర్ తన స్టామినాను వరంగల్ సభతో నిరూపించారు.

To Top

Send this to a friend