కాజల్ ను ఇలా టార్గెట్ చేశావా..?

సినిమాల్లో హీరోయిన్లుగా చేసే వారి ఏజ్ ను ప్రకటిస్తే అవకాశాలు తగ్గిపోతాయి. అమెకంటే చిన్న వయసు హీరోలు కాజల్ తో చేయడానికి ఒప్పుకోరు. అందుకే తెలివిగా హీరోయిన్లు ఎవ్వరూ ఆమె వయసును ఇండస్ట్రీలో చెప్పుకోరు. కానీ ప్రస్తుతం కాజల్ హీరోయిన్ గా చేస్తున్న సినిమా దర్శకుడు తేజ టీం కాజల్ వయసును ప్రకటించి ఆమెను ఇబ్బంది పెట్టింది.. కాజల్ కు 32వ బర్త్ డే శుభాకాంక్షలు అని తేజా, యూనిట్ ప్రకటించడంతో కాజల్ అవాక్కయ్యింది.

టాలీవుడ్ , కోలీవుడ్, మాళీవుడ్ తో పాటు హిందీలో కూడా కాజల్ పలు చిత్రాల్లో నటించి పేరు సంపాదించింది. ప్రస్తుతం తెలుగులో నంబర్ 1 హీరోయిన్ గా కొనసాగుతోంది.చిరంజీవి ఖైదీ నంబర్ 150తో పాటు మెగా హీరోలు రాంచరణ్, అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలా అందరితో ఆడిపాడింది. చూస్తేనే ఆకట్టుకునే కాజల్ అగర్వాల్ కి అప్పుడు మూడు పదులు దాటేశాయి. ఈ విషయాన్ని తాజాగా ఆమె నటిస్తున్న ‘నేనే రాజు.. నేనే మంత్రి’ టీం ప్రకటించి ఘోర తప్పిదం చేసింది..

దర్శకుడు తేజ దర్శకత్వంలో రానా, కాజల్ హీరోహీరోయిన్లుగా ‘నేనే రాజు.. నేనే మంత్రి’అనే సినిమా తెరకెక్కుతోంది. కాజల్ ను తెలుగులో పరిచయం చేసిన దర్శకుడు తేజా చాలా గ్యాప్ తర్వాత తీస్తున్న ఈ సినిమాలో మళ్లీ కాజల్ నే హీరోయిన్ గా ఎంచుకున్నారు. స్వామిభక్తితో కాజల్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది.

To Top

Send this to a friend