టీడీపీకి షాక్.. ప్రజాతీర్పు వైసీపీకే..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. కాదు.. కాదు.. కోట్లు కుమ్మరించి ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి విజయాన్నందుకుంది. కానీ ఇది ప్రజాభిప్రాయం కాదు.. కానీ అసలైన ప్రజాభిప్రాయంలో అధికార టీడీపికి ఎదురుదెబ్బ తగిలింది. మేధావులు, విద్యావంతులు, యువత వైసీపీ వెంట ఉన్నారని రుజువైంది. ఈ ఫలితారు 2019లోనూ వైసీపీకి బూస్ట్ లా పనిచేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు..

స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏపీలో టీచర్స్, గ్రాడ్యూయేట్స్ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ మద్దతిచ్చిన అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో వైసీపీకి జనంలో ఆదరణ ఉందని రుజువైంది.

*టీచర్స్ కోటా లో వైసీపీ+వామపక్ష అభ్యర్థి విజయం
తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పరిధిలోని నియోజకవర్గాల పరిధిలో జరిగిన టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీలు అభ్యర్థి విఠపు, కత్తి నరసింహారెడ్డిలు దారుణ పరాజయం పొందారు. వైసీపీ మద్దతిచ్చిన వామపక్ష పార్టీల అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఇక్కడ గతంలో సిట్టింగులు, కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన వారికే చంద్రబాబు టికెట్ ఇచ్చారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులైన టీచర్లు వీరికి వ్యతిరేకంగా ఓటేశారు. ప్రతిపక్ష వైసీపీ+వామపక్షాలను గెలిపించి టీడీపీ కి జనాదరణ లేదని రుజువుచేశారు.

* పట్టభద్రుల ఓటు వైసీపీకే..
ఇక పశ్చిమ రాయలసీమలో టీడీపీకి పట్టభద్రులు షాక్ ఇచ్చారు.. ఇక్కడ వైసీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. బ్యాలెట్ ఓట్లతో జరిగిన పోరులో ఇప్పటికే ఆయన 4వేల ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. తుది ఫలితాలు సాయంత్రం వరకు వెలువడనున్నాయి.

ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలని కొని అధికారంలో టీడీపీ నిలబడవచ్చు.. కానీ సమాజాన్ని మార్చే టీచర్లు, పట్టభద్రులు టీడీపీకి వ్యతిరేకంగా ఓటేశారు. ఇది ప్రజాతీర్పు. అంటే వైసీపీకి అనుకూలంగా తీర్పునిచ్చారు. వచ్చే 2019 ఎన్నికల్లో ఇదే పునరావృతమైతే టీడీపీకి ఎదురుదెబ్బలు ఖాయం. వైసీపీకి మంచి రోజులు రావడం తథ్యం..

To Top

Send this to a friend