టీడీపీ వ్యతిరేక పోస్టులు.. అడ్మిన్ అరెస్ట్


వైసీపీ కి మద్దతుగా టీడీపీకి వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో పొలిటికల్ పంచ్ పేరుతో ఓ పేజ్ నిర్వహిస్తున్న నిర్వాహకుడు రవికిరణ్ ను మరోసారి టీడీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇదివరకే ఓ సారి చట్టసభలను అవమానించేలా పోస్టు పెట్టాడని అరెస్ట్ చేసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయినా విడిచిపెట్టని టీడీపీ శిభిరం తాజాగా ఎమ్మెల్యే అనితతో ఫిర్యాదు చేయించి మరోసారి పొలిటికల్ పంచ్ నిర్వాహకుడిని అరెస్ట్ చేయించింది.

పొలిటికల్ పంచ్ పేజ్ అడ్మిన్ రవికిరణ్ పై పోలీసులకు మంగళవారం విశాఖలో ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేశారు. వేగంగా స్పందించిన పోలీసులు రవికిరణ్ ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వెంటనే రవికిరణ్ కు కోర్టు రిమాండ్ విధించింది. రవికిరణ్ అరెస్ట్ పై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైసీపీకి మద్దతుగా రవికిరణ్ పోస్టులు పెట్టాడన్న నెపంతోనే పోలీసులు అతనిని అరెస్ట్ చేశారని.. ఆయనకు మద్దతుగా వైసీపీ నేతలు న్యాయపోరాటం చేయనున్నట్టు తెలిపారు.

To Top

Send this to a friend