4 లక్షల కోట్లే.. టీడీపీ బ్యాచ్ కు లాభాలట..!

టీవల పెద్ద భూకుంభకోణం వెలుగుచూసింది. ముగ్గురు రిజిస్ట్రార్ లు ఏకంగా ఒక ఊరినే రిజిస్ట్రర్ చేయించారు. వేల కోట్ల విలువైన ఈ భూ కుంభకోణంపై కేసీఆర్ సీరియస్ అవ్వడం.. సదురు రిజిస్ట్రేషన్ అధికారులు జైలుకు వెళ్లడం తెలిసిందే..

అయితే అంతకంటే పెద్ద భూ కుంభకోణం ఏపీలో జరుగుతోందట.. విశాఖలో టీడీపీ మంత్రి, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా సాగిస్తున్న ఈ భూదందా దాదాపు 4 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు. విశాఖలోని భూ కబ్జాలపై సాక్షి టీవీ చానల్ వరుస కథనాలపై విజయసాయి స్పందించారు.

విశాఖలోని భూకబ్జాల వ్యవహారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సహా టీడీపీ ఎమ్మెల్యేలున్నారని.. ఈ గ్యాంగ్ ను వెనుకాల ఉండి నడిపిస్తున్నది మంత్రి నారాలోకేష్ అని విజయసాయి విమర్శలు గుప్పించారు. అంతేకాదు వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ భూకబ్జాలన్నింటిపై దర్యాప్తు జరుపుతామని.. దోచుకున్న సొమ్మంతా రికవరీ చేస్తామని విజయసాయి హెచ్చరించారు.

జగన్ ను లక్ష కోట్లు దోచుకున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. ఇప్పుడు ఏకంగా 4లక్షల కోట్ల టీడీపీ భూకబ్జా బాగోతాన్ని వైసీపీ, సాక్షి మీడియా లేవనెత్తడం కలకలం రేగింది. అధికారంలోకి వస్తే తిన్నదంతా కక్కిస్తామని విజయసాయి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

To Top

Send this to a friend