నంద్యాల గెలుపుకోసం రౌడీల సాయం..

‘ఎలాగైనా ఓడించాలి.. జగన్ ను గెలువనిచ్చే పరిస్థితి రావద్దు. అందుకోసం ఏమైనా చేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసైనా నంద్యాలలో టీడీపీ జెండా ఎగురవేయాలనే’ కసి టీడీపీ నేతల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల వేడి రాజుకుంటోంది.. అధికార టీడీపీ ఇక్కడ గెలవడం కోసం ఏమేం చేస్తుందో తెలిస్తే షాక్ కు గురవుతారు. రాజకీయాలు ఇంతలా చెడిపోయాయా అని మథన పడతారు.

నంద్యాలలో వైసీపీని ఓడించేందుకు టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల టీడీపీ అధినాయకత్వం నంద్యాల నియోజకవర్గంలో చోటా మోటా నాయకులు, రౌడీషీటర్లు, కార్యకర్తలతో సమావేశమైంది. నంద్యాల ఎన్నికల్లో గెలిపిస్తే కరుడుగట్టిన రౌడీలపై ఉన్న రౌడీషీట్ తీసేస్తామని కర్నూల్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వరరావు గారు బహిరంగంగా ప్రకటించటం సంచలనంగా మారింది. ఈ పిలుపు ప్రజాస్వామ్య వాదులను, మీడియాను , ప్రజలను విస్మయానికి గురిచేసింది. టీడీపీ శిభిరం మాత్రం ఈ వార్తను బయటకు పొక్కకుండా మీడియాను నియంత్రించి కప్పేసింది.

ఒక వ్యక్తికి రౌడీషీట్ తెరవాలి అంటే అతనికి ఎంతో నేరచరిత్ర ఉంటే కానీ ఓపెన్ చేయరు … అందులోనూ ఫ్యాక్షనిజానికి పేరు పొందిన కర్నూలు జిల్లాలో రౌడీ లు ఎంత కరుడుగట్టిన వాల్లో తెలుగు వాళ్ళందరికీ తెలుసు …అలాంటిది ఎన్నికల్లో గెలవడం కోసం రౌడీషీట్లను ఎత్తి వేస్తానంటూ సాక్షాత్తు టీడీపీ జిల్లా అధ్యక్షుడు చెప్పటమే కాక ఈ విషయమై ఇప్పటికే సీఎం చంద్రబాబు తో చర్చించామని చెప్పటం … రెండు రోజుల్లో లోకేష్ బాబు ఈ విషయంపై మాట్లాడతారని చెప్పటం టీడీపీ బరితెగింపుకు నిదర్శనం అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడం కోసం చేస్తున్న ఈ అనైతిక కార్యకలాపాలపై నాయకులు, ప్రజలు, వైసీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నంద్యాల బరిలో టీడీపీ తరఫున మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబంలోంచి ఆమె సోదరుడు బరిలో నిలిచారు. ఇక వైసీపీ తరఫున శిల్పా మోహన్ రెడ్డి బరిలో నిలిచారు. వీరిద్దరికి హోరాహోరీ పోటీ నెలకొనడంతో టీడీపీ ఈ ప్లాన్ చేసింది. అంతిమనిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరూ గెలుస్తారనే టెన్షన్ సర్వాత్రా నెలకొంది.

To Top

Send this to a friend