టీడీపీ ఎమ్మెల్యేలు అధికారిని కొట్టినా కేసులుండవా..

ఏపీ అనే సమ్రాజ్యంలో చక్రవర్తి చంద్రబాబు.. అక్కడ ఆయన చేసిందే చట్టం.. చెప్పిందే వేదం.. ఆయన అనుంగ మంత్రులు ఏకంగా రవాణాశాఖ అధికారిని కొట్టినా కేసులుండవు.. ప్రతిపక్ష నాయకుడు జగన్ ఆసుపత్రిలో చనిపోయిన బాధితుల పక్షాన మాట్లాడితే జైలుకు పంపిస్తారు..? కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు అధికారిని కొట్టినా కూడా కించత్ కేసులు, చర్యలు ఉండవు.. ఈ రాజ్యంలో అధికారపక్షానికి ఒకనీతి.. ప్రతిపక్షానికి మరో నీతి ఉంది. అందుకే ఇప్పుడు అందరూ ఆ చక్రవర్తి చంద్రబాబు వైఖరిని ప్రశ్నిస్తున్నారు..

నడిరోడ్డు మీద ఏపీ సీనియర్ అధికారి బాలసుబ్రహ్మణ్యంను నిర్భదించి ఆయనపై గుండాగిరీ చేసి.. అడ్డొచ్చిన ఆయన గన్ మెన్ పై దాడికి ప్రయత్నించిన టీడీపీ ఎంపీ కేశినేని.. ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు వెనకేసుకురావడం దుమారం రేపుతోంది. అధికార అండతో అధికారులపై దౌర్జన్యాలు చేస్తూ ఏపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారు. అయినా చర్యలు లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. దీనిపై ఏపీ వ్యాప్తంగా జనంలో .. సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

కాగా ఈ వివాదం ముదరడంతో ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి ఎంపీ, ఎమ్మెల్యేలతో కమిషనర్ కు సారీ చెప్పించారు. మీడియా ముందట కమిషనర్ తో చెప్పించి వివాదం పెద్దది కాకుండా అడ్డుకున్నారు. ఇలా బాబు గారు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ అక్రమాలు, అరాచకాలను కొనసాస్తున్నారని ప్రతిపక్షాలు, ప్రజలు మండిపడుతున్నారు.

To Top

Send this to a friend