వైసీపీకి భంగపాటు.. టీడీపీకే కాకినాడ..

నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహం టీడీపీకి కాకినాడ కార్పొరేషన్ లోనూ రిపీట్ అయ్యింది.. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకే కాకినాడ నగర ప్రజలు పట్టం కట్టారు. ఇక్కడా టీడీపీ హవానే కొనసాగింది. వైసీపీ మరోసారి ఘోర పరాభవాన్ని చవిచూసింది.

కాకినాడ కార్పొరేషన్ లో మొత్తం 48 డివిజన్లకు గాను టీడీపీ 32 డివిజన్లను సొంతం చేసుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక ప్రతిపక్ష వైసీపీ కేవలం 10 స్థానాలకే పరిమితమైపోయింది. టీడీపీ మిత్రపక్షం బీజేపీ 3 స్థానాల్లోనే గెలిచింది. ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు..

టీడీపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాల వల్లే ఈ విజయం సాధ్యమైందని.. స్మార్ట్ సిటీ ప్రకటించామని.. మంచి పరిపాలన అందిస్తున్నామని.. అందుకే రౌడీ రాజకీయాలకు దూరంగా టీడీపీకి ప్రజలు కట్టారని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా కాకినాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాకినాడను మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

To Top

Send this to a friend