ఆ బొడ్డంటే ఎందుకంత పిచ్చి..

దాదాపు 70కిపైగా వయసు.. 100కు పైగా చిత్రాలు చేశాడు. చిరంజీవి సహా ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. మహేశ్, అల్లు అర్జున్ లాంటి ఎంతో మందిని తెలుగు తెరకు పరిచయం చేశాడు. అలాంటి రాఘవేంద్రరావు సినిమాల్లో తీసే విధానం హీరోయిన్ తాప్సి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాఘవేంద్రరావుపైనే విమర్శలు గుప్పించింది. ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.

రాఘవేంద్రరావు సినిమాల్లో హీరోయిన్ల బొడ్డును దారుణంగా వాడుకుంటారని హీరోయిన్ తాప్సి పరుష వ్యాఖ్యలు చేయడం కలకలం రేగింది.. తెలుగులో తాప్సి చేసింది కొన్ని సినిమాలే. కానీ తెలుగులోనే తాప్సి ఎంట్రీ ఇచ్చింది. రాఘవేంద్రరావు తాప్సీని తెలుగు తెరకు పరిచయం చేశారు. ఝమ్మందినాదం సినిమాలో తాప్సి హీరో మంచు మనోజ్ పక్కన నటించింది. తాప్సి కి లైఫ్ ఇచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావుపైనే ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది.

అసలు రాఘవేంద్రరావు హీరోయిన్ల బొడ్డును ఎందుకు టార్గెట్ చేస్తాడో అర్థం కాదని తాప్సి బాలీవుడ్ మీడియాతో అనడం గమనార్హం. ప్రస్తుతం హిందీలో అవకాశాలు చేజిక్కించుకుంటున్న ఈ భామ.. తెలుగు దర్శకుడిని, దక్షిణాది వారిని అవమానించడం తాజాగా వివాదానికి దారితీసింది.. తాప్సీ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ… ‘రాఘవేంద్రరావు సీనియర్ దర్శకులు. అప్పటికే వందకుపైగా చిత్రాలు తీశారు. శ్రీదేవి, జయప్రద వంటి వారిని స్టార్లుగా చేశారు. అదేం విడ్డూరమో కానీ రాఘవేంద్రరావు హీరోయిన్ల బొడ్డులను మాత్రం వదలరు. బొడ్డును పండ్లు, పువ్వులతో కొట్టిస్తుంటారు. నా బొడ్డును కొబ్బరి చిప్పతో కట్టించాడు. ఇలా ఆయన హీరోయిన్ల బొడ్డును అలా ఎందుకు కొట్టిస్తారో నాకైతే తెలియదు.. మాకైతే అది ఇబ్బందే..’ అని రాఘవేంద్రరావును అవమానించేలా మాట్లాడింది.

To Top

Send this to a friend