రజినీకాంత్‌కు అతి పెద్ద షాక్‌

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఖరారు అయ్యింది. దాదాపుగా 15 సంవత్సరాల నుండి ఫ్యాన్స్‌ రజినీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలని, తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే సంపూర్ణ మద్దతును ఇస్తామంటూ ఫ్యాన్స్‌ ముందు నుండి చెబుతూ వస్తున్నారు. ఎట్టకేలకు రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కాని రజినీకాంత్‌ మరియు ఆయన కుటుంబ సభ్యుల మాటలు వింటే అలాగే అనిపిస్తుంది.

రజినీకాంత్‌ రాజకీయాలు అని ఎప్పుడు అయితే మాట వస్తుందో అప్పుడు వినిపించే మాట రజినీకాంత్‌కు ఆ అర్హత లేదు, ఆయన స్థానికుడు కాదు, తమిళుడు కాని వ్యక్తికి తమిళనాడును పరిపాలించే అర్హత లేదు అని కొందరు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రజినీకాంత్‌ సినిమాల వరకు మాత్రమే ఓకే, రాజకీయాల్లోకి ఆయనకు అంత సీన్‌లేదు, ఆయన రాకూడదు అంటూ ఆగ్రహం చేసే వారు ఉన్నారు.

తాజాగా రజినీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశంకు సంబంధించిన వార్తలు వచ్చిన వెంటనే ఆయన వ్యతిరేకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అలాగే ఆయన ఫ్యాన్స్‌ మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. ఇక సినిమా పరిశ్రమ నుండి కూడా కొందరు రజినీకాంత్‌కు పూర్తి మద్దతు తెలిపారు. అయితే రజినీకాంత్‌కు సినిమా పరిశ్రమ నుండి మొదటి సారి వ్యతిరేతక వ్యక్తం అవుతుంది. రజినీకాంత్‌ స్థానికుడు కాదు, ఆయనకు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు అంటూ ప్రముఖ దర్శకుడు భారతీరాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాట దుమారం రేపుతున్నాయి. భారతి రాజ చేసిన వ్యాఖ్యల వల్ల సినిమా ఇండస్ట్రీలోని ఇంకా కొందరు కూడా రజినీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సిద్దం అవుతున్నారు. ఈ పరిస్థితి రజినీకాంత్‌కు పెద్ద షాక్‌గా చెప్పుకోవచ్చు. వీటన్నింటి నుండి రజినీ ఎలా బయట పడతాడు అనేది చూడాలి.

To Top

Send this to a friend