పదిహేనేళ్లు పూర్తి చేసుకొన్న తమన్నా..

ప్రస్తుతం ఉన్న పరిస్తుతుల్లో ఒక నటి 15 ఏళ్ళు సినీ ప్రయాణం సాగించింది అంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పక  తప్పదు. పంజాబీ గుడియా తమన్నా భాటియా సినీ జర్నీ ప్రారంభమై నేటికి పదిహేనేళ్ళు పూర్తి అయ్యాయి. తన పదిహేనవ యేట చిత్ర రంగంలో కాలుమోపిన  తమన్నా ఎన్నో విజయాలు, అపజయాలు చవి చూసింది. నటిగా మాత్రం ఏనాడు చెడ్డ పేరు తెచ్చుకోలేదు. తమన్నా ప్రతిభే  తమన్నాకి రక్షణ కవచం లా ఇన్నాళ్లు నిలబడింది.  మంచి నటి అన్న గుర్తింపు తమన్నా ఎపుడూ కోల్పోలేదు. 2007 లో వచ్చిన హ్యాపీ డేస్  చిత్రం తో తొలి విజయం అందుకొన్న తమన్నా ఆపై అనేక విజయాలకు మూల కారణం అయ్యింది. అందం, అభినయం రెంటిని తనలో ప్రోవు చేసుకొన్నఈ  మిల్కీ బ్యూటీ అనేక చిత్రాలకు అసెట్ గా నిలిచింది. 100 % లవ్ , అభినేత్రి, ఆవారా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం , ఊపిరి, ఊసరవెల్లి వాటి చిత్రాలు తమన్నా నటన కి ప్రత్యక్ష తార్కాణాలు అని గట్టిగా చెప్పొచ్చు. ఇక 2019  లో  వచ్చిన సైరా చిత్రం  తమన్నాలోని  నటనకి ఒక గీటురాయి అనాలి. విమర్శకుల ప్రశంసలు , ప్రేక్షక ఆదరణ  అలా రెంటినీ దక్కించు కొంటూ ముందుకెళ్తున్న తమన్నా నేటి యువ నటీమణులకు ఒక స్ఫూర్తి అందులో ఎటువంటి సందేహం అక్కరలేదు. a thing of beauty is joy forever

To Top

Send this to a friend