ట్రైలర్‌ ఫ్లాప్‌.. ఇక సినిమా?

సినిమా ఎలా ఉన్నా కూడా ట్రైలర్‌ను ఇటీవల అద్బుతంగా కట్‌ చేస్తున్నారు. ట్రైలర్‌ లేదా టీజర్‌ను చూస్తుంటే సినిమా చూసేయాలన్నంత ఆసక్తి కుగుతుంది. ట్రైర్‌తో సినిమా స్థాయి పెరగడం ఇటీవల పలు సినిమాలకు చూశాం. ట్రైలర్‌ వల్ల పలు సినిమాల బిజినెస్‌లు భారీగా జరిగాయి. కాని తాజాగా విడుదలైన ‘కథలో రాజకుమారి’ ట్రైలర్‌ మాత్రం చెత్తగా ఉందనే టాక్‌ను సొంతం చేసుకుంది. అర్థం పర్ధం లేని షాట్స్‌తో, కథపై ఒక క్లారిటీ లేకుండా గందరగోళంగా ట్రైలర్‌ను కట్‌ చేశారు.

ట్రైలర్‌తోనే సినిమా ఖచ్చితంగా ఫ్లాప్‌ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. హీరో నారా రోహిత్‌ ఓవర్‌ యాక్షన్‌, హీరోయిన్‌ నందిత ఫేస్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌ లేకుండా నటించడం సినిమాకు మైనస్‌ అని విడుదలకు ముందే తేలిపోయింది. అంతో ఇంతో నాగశౌర్య పర్వాలేదు అన్నట్లుగా నటించాడు. సినిమా బ్యాడ్రాప్‌లో తెరకెక్కిన ఈ ‘కథలో రాజకుమారి’ చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం లేదని ట్రైలర్‌ చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు.

ట్రైలర్‌నే సరిగా కట్‌ చేయలేని దర్శకుడు సినిమాను అర్థవంతంగా తెరకెక్కించాడు అంటే ఎలా నమ్మగలం అని సాదారణ ప్రేక్షకులు సైతం అంటున్నారు. మహేష్‌ సురపనేని ట్రైలర్‌పై మరింత శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది. సినిమా విడుదలైతే కాని అసలు విషయం తెలియదు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

To Top

Send this to a friend