ఆయనో ఎమ్మెల్యేనయ్యా.. ‘తేడా’ ఏంటీ.?


పూరి జగన్నాథ్ తన తిక్కను అంతా సినిమాల్లో చూపిస్తూ అందులో నటించే హీరోల పరువు తీస్తున్నారు. ఇడియట్, టెంపర్, రోగ్ వంటి తిట్లను సినిమాలకు టైటిల్స్ గా పెట్టి ఆ హీరోలను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నాడు.అవి హిట్ అయితే పర్లేదు కానీ ప్లాప్ అయితే మాత్రం పూరితో ఎందుకు సినిమా తీశాంరా దేవుడా అని హీరోలు బాధపడుతున్నారు.

అందుకే కొద్దిరోజులుగా పూరితో సినిమాలు చేయడానికి ఏ అగ్రహీరో కూడా ఆసక్తి చూపించడం లేదు. కానీ నందమూరి బాలక్రిష్ణ తన 101 వ సినిమాను పూరితో చేయడానికి ఒప్పుకున్నాడు. ఇదో సదావకాశంగా మల్చుకొని దాన్ని బాగా తీర్చిదిద్దితే ఏ సమస్య ఉండేది కాదు. కానీ మళ్లీ పూరీ అదే పాత పంథాతో భ్రష్టుపట్టిన టైటిల్ ను బాలయ్య సినిమాకు పెడుతుండడం ఆయన అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘తేడా సింగ్’ టైటిల్ పెట్ట బోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా టైటిల్ ను, ఫస్టులుక్ ను ఈనెల 9న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారట.. అయితే ఈ టైటిల్ పట్ల బాలయ్య ఫ్యాన్స్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టైటిల్ వద్దని నిర్మాతపై ఒత్తిడి తెస్తున్నారట ఆయన అభిమానులు.. కానీ పూరి జగన్నాథ్ ‘తేడాసింగ్’ అనే టిైటిల్ వైపే మొగ్గుచూపుతున్న సమాచారం. బాలయ్య కలుగజేసుకొని టైటిల్ మార్చాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.

To Top

Send this to a friend