తాగుబోతుల కోసం సూపర్ ఐడియా..!

“జాతీయ రహదారికి 500 మీటర్లలోపు ఉంటే అన్ని బార్లను మూసేయండి.. ఇది ఫైనల్ డెసిషన్. హైవేలపై బార్లతో ప్రమాదాలు అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయం” ఇది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వక్రభాష్యం పలుకుతూ.. సరికొత్త ఆలోచనతో దేశవ్యాప్తంగా మరో వివాదానికి తెరతీశారు కేరళలోని ఓ బార్ ఓనర్స్. వీడి అతితెలివికి యావత్తు దేశమే ఔరా అని నోరెళ్లబెట్టింది.

కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలో జాతీయ రహదారి 17పై ఐశ్వర్య అనే బార్ ఉంది. ఈ బార్ రోడ్డుకు 200 మీటర్ల దూరంలో ఉంది. కోర్టు ఆదేశాల ప్రకారం దీన్ని తొలగించాలి. అయితే బార్ యజమాని ఓ కొత్త ఐడియా వేశాడు. బార్ లోకి వెళ్లే ఎంట్రన్స్ రూపురేఖలు మార్చాడు. జిగ్ జాగ్ గా ఏర్పాటు చేశాడు. అదేనండీ.. మన ఆలయాల్లో అటూ ఇటూ తిప్పుతూ తీసుకెళతారే.. అచ్చం అలాగే జిగ్ జాగ్ గా క్యూలైన్ల ఏర్పాటు చేశాడు. హైవేకు నా బార్ 200 మీటర్ల దూరంలో ఉంది.. మరో 300 మీటర్లు క్యూలైన్లు ఏర్పాటు చేశాను. మొత్తంగా కస్టమర్ల బార్ లో ఎంటర్ కావాలంటే 500 మీటర్లు దూరం నడిచిరావాలి.. నిబంధనల ప్రకారం సరిపోయింది అని చెబుతున్నాడు.

వీడి అతితెలివికి అధికారులు సైతం నోరెళ్లబెట్టారు. 500 మీటర్ల నిబంధన అయితే సరిపోయింది కానీ.. అది నేరుగా ఉండాలా.. వంకర్లుగా తిరుగుతూ ఉండాలా అని చెప్పలేదు కదా అని వాదిస్తున్నాడంట. మొత్తంగా ఈ బార్ ఓనర్ ఐడియా దేశం మొత్తాన్ని ఔరా అనిపించింది. మరి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

To Top

Send this to a friend