‘సైరా’ నరసింహారెడ్డిగా చిరంజీవి..

ఆగస్టు 22.. ఈరోజు చిరంజీవి బర్త్ డే.. మెగాస్టార్ పాలుపంచుకోకుండా దూరంగా ఉండగా.. ఆయన అభిమానులతో కలిసి రాంచరణ్ పండుగను ఘనంగా నిర్వహించాడు చిరంజీవి 151వ సినిమా ‘సైరా.. నరసింహారెడ్డి’ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్ గా ఈ వేడుకను నిర్వహించారు. అయితే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చేతుల మీదుగా రాంచరణ్ విడుదల చేయించాడు.

మెగా అభిమానులకు పండుగ రోజు.. ఆరోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. మెగాస్టార్ బర్త్ డే అంటే రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులకు పండుగ రోజు. రక్తదానాలు, కేక్ కటింగ్ లు, సేవా కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. కానీ ఈ ఆగస్టు 22న చిరంజీవి హైదరాబాద్ లో ఉండడం లేదని సమాచారం. దీంతో నాన్న చిరంజీవి బర్త్ డే వేడుకలను రాంచరణ్ దగ్గరుండి నిర్వహించాడు.. ఈ వేడుకకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు హాజరు అయ్యారు. పరిచూరి బ్రదర్స్, ఉయ్యాలవాడ టీం, రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై చిరు 151వ సినిమా ‘సైరా’ నరసింహారెడ్డి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. సినిమాకు అందరూ ఊహించినట్టు ‘ఉయ్యాలవాడ నరసింహరెడ్డి’ కాకుండా ‘సైరా’గా నామకరణం చేసి ట్యాగ్ లైన్ గా నరసింహారెడ్డి అని పెట్టారు.

ఇక చిరు బర్త్ డేను ఈసారి ఓ మంచి జ్ఞాపకంగా ఉంచడానికి ఈ వేడుకను చాలా గ్రాండ్ గా నిర్వహించాడు రాంచరణ్. 151వ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు బర్త్ డే కేక్ కట్ చేయించాడు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో గల సంధ్య కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకలో ఉయ్యాల వాడ లో పాల్గొనే నటులు, సినీ ప్రముఖులు, ముఖ్య అతిథిగా రాజమౌళి పాల్గొన్నారు.

To Top

Send this to a friend