ఎస్వీకె సినిమా ఓయ్.. నిన్నే.


నారా రోహిత్‌తో సోలో చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా తన అభిరుచిని చాటుకొని విజయాన్ని అందుకున్న నిర్మాత ఎస్వీకె సినిమా అధినేత వంశీ కృష్ణ శ్రీనివాస్. ఆ తర్వాత అల్లరి నరేష్, శర్వానంద్ కలయికలో నువ్వా-నేనా, సందీప్‌కిషన్‌తో రా రా కృష్ణయ్య వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన వంశీకృష్ణ శ్రీనివాస్ తాజాగా నూతన హీరో, హీరోయిన్‌ను పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ఓయ్..నిన్నే.

 

భరత్ , సృష్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా పరశురామ్, చందు మొండేటి, సుధీర్ వర్మల వద్ద దర్శకత్వ శాఖలో పలు చిత్రాలకు పనిచేసిన సత్య చల్లకోటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ గ్రామీణ నేపథ్యంలో నడిచే అందమైన కుటుంబ కథా చిత్రమిది. ఫ్యామిలీ ఎమోషన్స్ విత్ క్యూట్‌లవ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో అన్ని వర్గాలకు వారికి నచ్చే అంశాలున్నాయి.

 

ఈ నెల రెండోవారంలో ఆడియోను విడుదల చేసి, చివరివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. భరత్, సృష్టి, తనికెళ్ళభరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, తాగుబోతు రమేష్, తులసి, ప్రగతి, ధన్‌రాజ్ తదితరులు నటస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటింగ్: మార్తండ్.కె.వెంకటేష్, ఫైట్స్: వెంకట్, నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్, దర్శకత్వం: సత్య చల్లకోటి.

To Top

Send this to a friend