ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డిది హత్యా, ఆత్మహత్యా.?


అదే స్టేషన్, వరుసగా రెండో ఎస్సై, అదే పొజిషన్.. కణతిపై కాల్చుకొని ఆత్మహత్య, కట్ చేస్తే హైదరాబాద్ లో ఎవరో బ్యూటిషియన్ సూసైడ్.. ఆ తర్వాత ఎస్సై సూసైడ్. ఈ రెండింటికి లింక్ పెట్టి పోలీసులు లీకులు వదిలితే మీడియా, పత్రికలు కోడై కూస్తున్నాయి. వెబ్ సైట్ కథనాలు సరేసరి.. ఇంతకీ బ్యూటిషియన్ అక్రమ సంబంధాలు, మరణం పక్కనపెడితే.. ప్రజలను రక్షించాల్సిన దృఢమైన పోలీస్ ఇంత పిరికిగా ఆత్మహత్య చేసుకుంటాడంటే నమ్మశక్యంగా లేదు. ఆయన భార్య, ఆ ఊరి గ్రామస్థులు కూడా ఇదే చెప్తున్నారు. మరి ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డిది హత్యా , నిజంగానే ఆత్మహత్యా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డి భార్య స్వయంగా చెబుతోంది. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే మథన పడ్డాడని చనిపోయాడని.. ఎస్.ఐ స్నేహితులు కూడా వేధింపులేనని చెబుతున్నారు. దాన్నెందుకు పోలీసులు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్న ఉదయిస్తోంది. ఎస్.ఐ మరణానికి నిజంగా శిరీష ఆత్మహత్యే కారణమని అనుకుంటే.. మరి గజ్వేల్ ఏసీపీని ఎందుకు సస్పెండ్ చేశారనే ప్రశ్న ఉదయిస్తోంది..

‘‘ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్ పై ఎన్నో అనుమానాలు.. కణతపై కాల్చుకుంటే పక్కకు పడిపోవాలి.. పడిపోలేదు. బుల్లెట్ తలనుంచి పోయి గోడకు తగలాలి.. అదీ లేదు. రక్తం కాళ్లపై పడాల్సిన అవసరం లేదు. అయినా పడింది. ఎస్.ఐ కుడిచేతికి గాయం ఎందుకు అయ్యింది. కాల్చుకున్న తుపాకీ కాళ్ల కింద ఎడమ కాలి వెనుకాల ఎందుకు పడిపోతుంది. వెనక్కి పడిపోవాలి కదా.. ఎవరో కాల్చి ఎస్పై కాళ్ల కింద తుపాకీ వేశారా.?’’ ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్నలు. కానీ ప్రభుత్వం, పోలీసుల దగ్గర సమాధానం లేదు. ఎక్కడో హైదరాబాద్ లో మహిళ ఆత్మహత్యకు, ఎస్.ఐ మరణానికి ముడిపెట్టి.. కథనాలు అల్లుతున్నారు. అసలు తెలంగాణ పోలీస్ శాఖలో ఏం జరుగుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రాణాలు మాత్రం పోతున్నాయి.

To Top

Send this to a friend