పాత నోట్ల మార్పిడిపై సుప్రీం సంచలన ఆదేశాలు

 

రద్దు చేసిన పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోని వారికి మరో అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్.బి.ఐ ని సూచించింది సుప్రీంకోర్టు. నిజాయితీగా డబ్బు సంపాదించినట్లు తగిన ఆధారాలు చూపిస్తే.. అలాంటి వారికి బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది కోర్టు. తగిన ఆధారాలు, కారణాలు చూపించే వారిని ఇబ్బంది పెట్టొద్దని సూచించింది కోర్టు.

నిజాయతీపరులు నష్టపోకుండా చూడాలని కోరింది . పాత నోట్లను మార్చుకునేందుకు వారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. సమాధానాన్ని అఫిడవిట్ రూపంలో.. రెండు వారాల్లో అందిచటానికి ఆదేశించింది కోర్టు.

నోట్ల రద్దుపై దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారించిన కోర్టు.. ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 18వ తేదీకి వాయిదా వేసింది. పాత నోట్లు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించిన క్రమంలో.. సుప్రీంకోర్టు ఈ సూచనలు ఇవ్వటంతో వారికి ఊరట నిచ్చింది.

To Top

Send this to a friend