గోవధపై కేంద్రానికి షాక్..

గోవధపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా గోవులను కబేళాలకు తరలించడం.. గోమాంసాన్ని నిషేధించడంపై ఇవ్వాళ సుప్రీంకోర్టులో వాదనలు నడిచాయి. ఇందులో పశువులను వధ కోసం అమ్మకుండా, కొనకుండా కేంద్రం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. జంతువధ నిషేధంపై కేంద్రం జారీ చేసిన సర్క్యూలర్ పై స్టే విధించింది.

ఆవులు, ఎద్దులు, దున్నపోతులు, గేదెలు, ఒంటెలు, కోడెలు, దూడలు ఇలా పశువులను వేటిని మాంసం కోసం వధించడానికి లేదా మత అవసరాల కోసం వధించడాన్ని కేంద్రం నిషేధించింది. దీనిపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన స్టేపై కేంద్రం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈరోజు విచారించిన సుప్రీం కోర్టు కూడా మద్రాస్ హైకోర్టును సమర్థించి గోవధ నిషేధం, గోవుల క్రయవిక్రయాలపై కేంద్రం విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.

రాజ్యాంగం ప్రసాదించిన మతస్వేచ్ఛకు గోవధ నిషేధం విఘాతం కలిగిస్తోంది. జంతుబలి, ఆ మాంసంతో వంటలు చేసుకోవడం భారతీయ సంస్కృతి. నిషేధం వల్ల పశువుల క్రయవిక్రయాలు నిలిచిపోతాయి. రైతులు, వ్యాపారులు, కబేళాల ఉద్యోగులకు జీవనోపాధి దెబ్బతింటుందని’ సుప్రీంకోర్టు కేంద్రానికి షాక్ ఇస్తూ నిషేధాన్ని ఎత్తివేసింది.. దీంతో మతం రంగు పులముకొని ఆరాటపడ్డ బీజేపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

To Top

Send this to a friend