సూపర్ స్టార్ x బర్నింగ్ స్టార్


ఈరోజు సాయంత్రం మహేశ్ బాబు తన లేటెస్ట్ సినిమా ఫస్ట్ లుక్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. మురగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేశ్ బాబు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలు, టీజర్ లు విడుదల కాలేదు. ఇప్పుడు సినిమా ఫస్ట్ లుక్ తో పాటు సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారట.. మహేశ్ సినిమాను జూన్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్ ను కూడా రిలీవ్ చేయనున్నట్టు సమాచారం.

అయితే సూపర్ స్టార్ మహేశ్ కు పోటీగా బరిలోకి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు దిగుతున్నారు. సంపూ సోషల్ మీడియాలో ఈ మేరకు ప్రకటన చేశాడు. సంపూ నటిస్తున్న కొబ్బరిమట్ట పాటను మంగళవారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారట.. మహేశ్ ఫస్ట్ లుక్ 5 గంటలకు అయితే ఇది గంట ఆలస్యంగా నన్నమాట..

అయితే మహేశ్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు సంపూ పాట విడుదల చేస్తే హైప్ వస్తుందని.. సోషల్ మీడియాలో, మీడియాలో ప్రచారం ఊపందుకుంటుందని సంపూ అండ్ టీం.. ఈ ప్లాన్ చేసినట్టు సమాచారం.

కాగా కొబ్బరిమట్ట సినిమా ఏ కారణంచేతో చాన్నాళ్ళుగా విడుదలకు నోచుకోవడం లేదు. ఎట్టకేలకు సినిమాను విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సంపూ పెదరాయుడు లాంటి పాత్రను పేరడిగా చేస్తూ నవ్వులు పూయిస్తాడట.. సో అటు మహేశ్ .. ఇటు సంపూ ఒకే రోజు రెండు సినిమాల విశేషాలను అభిమానులతో పంచుకున్నారన్నమాట..

To Top

Send this to a friend