‘స్పైడర్‌’ అదిరిపోయే షాకింగ్‌ న్యూస్‌


సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కోసం ప్రేక్షకులు దాదాపుగా సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు. మురుగదాస్‌  మరియు మహేష్‌బాబు ఇతరత్ర పనుల కారణంగా సినిమా విడుదల ఆలస్యం జరుగుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా టీజర్‌లో పేర్కొన్నారు. దాంతో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి అంతా కూడా సెప్టెంబర్‌పై ఉంది. ఈ సమయంలోనే చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి చిత్రానికి సంబంధించిన ఒక షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది.

ఒక రెగ్యులర్‌ తెలుగు ప్రేక్షకులు తాను చూడాలనుకుంటున్న సినిమాలో ఆరు పాటలు, మూడు ఫైట్‌లు, నాలుగు కామెడీ సీన్స్‌, రెండు సెంటిమెంట్‌ సీన్స్‌ ఉండాలని కోరుకుంటాడు. ఇదే ఫక్త్‌ ఎంటర్‌టైనర్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ సినిమాగా సాదారణ ప్రేక్షకుడి అభిప్రాయం. కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ‘స్పైడర్‌’ చిత్రం రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రం కాదని తెలుస్తోంది.

‘స్పైడర్‌’ చిత్రంలో రెండు లేదా మూడు పాటలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కామెడీ కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్‌ను దర్శకుడు సిద్దం చేయలేదు. దాంతో కామెడీ కూడా పెద్దగా ఉండే అవకాశాలు లేవు. ఫైట్స్‌ కూడా మాస్‌ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించే స్థాయిలో ఉండవని తెలుస్తోంది. మొత్తానికి ఒక విభిన్న చిత్రంగా ఈ చిత్రం ఉండబోతుంది. మరి ఇది తెలుగు ప్రేక్షకులకు ఎక్కుతుందా అనేది చూడాలి.

To Top

Send this to a friend