మనం అంటే సన్నీకి తెగ ఇష్టమట


ప్రస్తుతం సినిమా నాలెడ్జ్‌ ఉన్న ప్రతి ఒక్కరికి సన్నీలియోన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోర్న్‌స్టార్‌గా రికార్డులు సృష్టించిన సన్నీలియోన్‌ ప్రస్తుతం పోర్న్‌ సినిమాలు పక్కన పెట్టి బాలీవుడ్‌ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంటుంది. ఈమె తెలుగు మరియు తమిళంలో కూడా సినిమాలు చేసింది. మంచు మనోజ్‌ నటించిన ‘కరెంట్‌ తీగ’ చిత్రంలో సన్నీలియోన్‌ ముఖ్య పాత్రలో నటించింది. అప్పటి నుండి మళ్లీ తెలుగులో ఈ అమ్మడు నటించింది లేదు. తెలుగులో నటించాలని ఉన్నా కూడా కుదరడం లేదు అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

సన్నీలియోన్‌ తాజాగా మాట్లాడుతూ… తెలుగు సినిమాల్లో నటించడం అంటే నాకు ఇష్టం. షూటింగ్‌ అనుకున్న సమయంకు ప్రారంభించి, అనుకున్న సమయంకు పూర్తి చేస్తారు. ప్రతి విషయంలో కూడా టైంను ఫాలో అవుతారు. ఒక సమయంకు ఏదైనా సీన్‌ అయిపోవాలి అంటే ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తారు. బాలీవుడ్‌తో పోల్చితే టాలీవుడ్‌లో నటించడం సౌకర్యంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. తనను తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆధరిస్తారని, అందుకు నాకు కూడా తెలుగు ప్రేక్షకులు అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు రాజశేఖర్‌ నటిస్తున్న ‘గరుడవేగ’ చిత్రంతో రాబోతుంది. ఆ చిత్రం కాకుండా ఇప్పటి వరకు మరో తెలుగు సినిమాకు కమిట్‌ కాలేదు. డేట్లు కుదరక పోవడంతో పాటు, ఇతరత్ర కారణాల వల్ల తెలుగులో నటించలేక పోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ‘గరుడవేగ’ చిత్రంతో ఆకట్టుకుంటాను అంటూ నమ్మకంగా చెబుతుంది.

To Top

Send this to a friend