సన్నీ ఎంత పనిచేసింది..?

సన్నీ లియోన్ అంటేనే సెక్సీ బాంబ్.. పోర్న్ స్టార్ నుంచి వచ్చి బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదిగిన ఈ భామకు యువతలో పిచ్చ క్రేజ్ వచ్చింది. కరెంట్ తీగతో తెలుగులో ఐటం సాంగ్ లు చేసి ఎంట్రీ ఇచ్చిన సన్నీ ఈ మధ్య తెలుగు సినిమాల్లో , వేదికలపై అదరగొడుతోంది. నాకు బాలీవుడ్ కంటే దక్షిణాదిలోనే ఎక్కువగా సౌకర్యం , సుఖం ఉంటుందని మొన్నీమధ్య హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పుకొచ్చింది. దక్షిణాదిలో ఏ చిన్న అవకాశం వచ్చిన సన్నీ లియోన్ మాత్రం వదులుకోవడం లేదు. ఆఖరుకు తెలుగు, తమిళనాట ఐటం సాంగ్ లను కూడా చేసేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

బాలీవుడ్ శృంగార తారగా పేరుగాంచిన ఈ భామకు వస్తున్న క్రేజ్ అంతా ఇంతాకాదు.. హిందీ సినిమాల్లో హాట్ హాట్ గా నటించే ఈ ముద్దుగుమ్మ తన క్రేజ్ ను లైవ్ లో చూసి ఆశ్చర్యపోయింది. ఆమెకే నమ్మశక్యంగా లేదట..

సన్నీ లియోన్ ఈరోజు కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఓ మైబైల్ కంపెనీ ప్రారంభోత్సవానికి వచ్చింది. అక్కడి యువత తండోపతండాలుగా తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. దీంతో ఆ ప్రాంగణమంతా జనసంద్రంగా మారింది. యువత భారీగా తనకోసం తరలిరావడంతో కాసేపు మాట్లాడి అందరీకి ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చింది సన్నీ. మీరు చూపించిన ప్రేమను ఎప్పటికీ మరిచిపోనంటూ సన్నీ ఉద్వేగానికి గురైంది.

ఓ వీడియోను కూడా తన ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి సంబరపడింది. తనకు ఇంత క్రేజ్ ఉందని ఊహించలేదని ఈ ముద్దుగుమ్మ ఆశ్చర్యపోయిందట.. అలా కేరళ అభిమానులు సన్నీకి మరిచిపోలేని రీతిలో పలికిన స్వాగతం ఫొటోలు ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

To Top

Send this to a friend