సునీల్ జీవితంలోని ఓ సంచలన విషయం..

సునీల్.. పరిచయం అక్కర్లేని కమెడియన్.. ఎంతో కష్టపడి కమెడియన్ గా.. హీరోగా ఎదిగిన ఈ స్టార్ ఇటీవల తన కొత్త సినిమా ప్రమోషన్ లో ఓ సంచలన విషయాన్ని రిలీవ్ చేశాడు.. ‘ సునీల్ కమెడియన్ గా మారిన కొత్తలో సొంతం సినిమాలో నటించాడు. ఆ సినిమా షూటింగ్ నిమిత్తం న్యూజిలాండ్ వెళ్లాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకొని తిరిగివస్తుండగా మధ్యలో సింగపూర్ లో దిగినప్పుడు ఓ కుటుంబం సునీల్ తో ఫొటో దిగింది. అప్పుడు వారి 2 ఏళ్ల పాపను సునీల్ చేతిలో పెట్టి ఫొటో దిగారు.

కట్ చేస్తే సునీల్ చేతిలో ఎత్తుకున్న ఆ రెండేళ్ల పాపే.. ఇప్పుడు దాదాపు 16 ఏళ్ల తర్వాత సునీల్ పక్కన హీరోయిన్ గా చేసింది. అదే ‘ఉంగరాల రాంబాబు’ అనే కొత్త సినిమాలో.. తాను ఎత్తుకున్న పాపే తన హీరోయిన్ గా చేసిందని.. ఇలాంటి సంఘటన ఎవ్వరికీ జీవితంలో ఎదురుకాదని సంభ్రమాశ్చార్యాలతో చెబుతున్నాడు హీరో సునీల్..

ప్రస్తుతం సునీల్ హీరోగా చేస్తున్న సినిమాలు విజయాలను అందుకోవడం లేదు. అడపాదడపా సినిమాలు చేసినా అవి ఆడడం లేదు. ఇప్పుడు ఏకంగా సునీల్ హీరోగా తీసిన సినిమాలను కొనడానికి బయ్యర్లు కూడా రావడం లేదట.. సునీల్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘ఉంగరాల రాంబాబు’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా పూర్తయి దాదాపు 4 నెలలు అవుతోంది. కానీ సునీల్ సినిమాను కొనడానికి బయ్యర్లు ముందుకు రాకపోవడంతో సినిమా విడుదల కావడం లేదు. ఈ సందర్భంగా ఇటీవల సినిమా ప్రమోషన్ లో మాట్లాడిన సునీల్ ఆ సినిమాలో హీరోయిన్ గురించి ఓ సంచలన వార్త బయటపెట్టాడు..

To Top

Send this to a friend