ఆదివారాలు, సాయంత్రం 6 తర్వాత పెట్రోల్ బం(ద్)క్

పెట్రోద్ల్ బంకులు.. ఇక డ్యూటీ ప్రకారమే పనిచేస్తాయి..ప్రధాని మోడీ జనాలకు చేస్తున్న మంచి పనుల కంటే చెడ్డ పనులే ఎక్కువగా ఉన్నాయని జనాలు ఆడిపోసుకుంటున్నారు. ఎన్నడూ బ్యాంకుల మొహం చూడని వారిని కూడా మోడీజీ నోట్లు రద్దు చేసి బ్యాంకుల ఎదుట ఎండలో గంటల తరబడి నిలబెట్టిన ఘనత వహించారు. ఇప్పుడు ఏకంగా వాహనాదారులకు ఆ పరీక్ష పెట్టాలని మోడీ అండ్ బీజేపీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

పెట్రోల్ బంకుల్లో కొత్త నిబంధనలు మే 14 వ తేది అంటే ఈ ఆదివారం నుంచి అమలవుతున్నాయట.. ఆదివారం పూట ఈ పెట్రోల్ బంకులు పనిచేయవు.. అంతేకాకుండా 24 గంటల పాటు కూడా వీటి సేవలు వినియోగదారులకు దక్కవు. ఎందుకంటే మే 15 వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పెట్రోల్ బంకులు పనిచేస్తాయని పెట్రోలియం సంస్థలు ఈరోజు ఓ ప్రకటనలో తెలిపాయి. అంటే ఇక నుంచి ఆదివారాలు, రాత్రి పూట బండిలో పెట్రోల్ అయిపోయిందా మీ పని గోవిందా..

కొత్తగా రానున్న నిబంధనలు వినియోగదారుల పాలిట శాపంగా మారనున్నాయి. బండిలో పెట్రోల్ ఉందో లేదో చూసుకోకుండా ఎటైనా వెళితే ఇబ్బందులు తప్పవు. సాయంత్రం 6 తర్వాత, ఆదివారాలు ఇక బయటకు వెళితే పెట్రోల్ చూసుకోవడం మంచిది. అంత రిస్క్ అనుకుంటే బస్ లోనే వెళ్లండి.. పర్యావరణాన్ని కాపాడేందుకు మోడీ ప్రభుత్వ తీసుకుంటున్న ఈ చర్యలు వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈరోజు శనివారం కావడంతో రేపు పెట్రోల్ బంక్ లు బంద్ అన్నమాట.. అందుకే హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాల్లో ఈ సమయంలో బంకుల్లో భారీగా వాహనాదారులు క్యూలు కట్టారు. హతవిధీ.. మోడీ జీ ఎంటిది అని వాహనాదారులు మండిపడుతున్నారు.

To Top

Send this to a friend