నోట్ల రద్దుతో లాభపడ్డ వ్యక్తి కథ ఇదీ!


దేశ రాజధానిలో అత్యంత ఖరీదైన ప్రాంతం గల్ఫ్ లింక్.. ఇక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక ఫ్లాటు విలువ కోట్లలో విలువ చేస్తుంది. దాదాపు 50 నుంచి 100 కోట్ల వరకు విల్లా ఖరీదు చేస్తుంది. ఈ గల్ఫ్ లింక్ లోని అత్యంత ఖరీదైన లుటియెన్స్ జోన్ లో 6వేల చదరపు అడుగుల ప్రాపర్టీని ఇటీవల పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ కొనడానికి అడ్వాన్స్ ఇచ్చాడట.. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది.

మోడీ దయవల్ల దేశ ప్రజలు నష్టపోయారు.. బడాబాబులు లాభపడ్డారనడానికి ఇదో పెద్ద ఉదాహరణ.. నోట్ల రద్దు వల్ల సామాన్యుల సంపద కరిగిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేక బ్యాంకుల ఎదుట క్యూల్లో నిల్చున్నారు. కానీ నోట్లు రద్దు కావడం వల్ల డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. పేటీఎం లాంటి మనీ వ్యాలెట్ సంస్థలకు మోడీ నిర్ణయం పెద్ద వరంలా మారాయి. వ్యాపారాన్ని విస్తరించాయి.

నోట్ల రద్దు తర్వాత దేశ ప్రజలు  పేటీఎం వాడకాన్ని విపరీతంగా పెంచారు. దీంతో పేటీఎం ఆదాయం దాదాపు 162 శాతం పెరిగిందట.. ఇలా దాని వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఈ దెబ్బకు అతి పిన్న వయసులోనే భారత బిలియనీర్ గా అవతరించి ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

సంపద వెల్లువలా రావడంతో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ ఢిల్లీలోని విలాసవంతమైన ఏరియాలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయడం వార్తల్లో నిలిచింది. శర్మ ఖరీదు చేసే ఈ విల్లా ధర సుమారు రూ.82 కోట్లు పైనే ఉంటుందని సమాచారం. దీంతో నోట్ల రద్దు తర్వాత బాగా లాభపడిన  పేటీఎం వ్యవస్థాపకుడిపై మీడియాలో రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. మోడీ సామాన్యులను కష్టపెట్టి బడాబాబులకు మేలు చేశాడనడానికి ఇదో పెద్ద ఉదాహరణ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

To Top

Send this to a friend