గుండెపోటుకు చేపతో చెక్!

ప్రస్తుత లైఫ్ స్టైల్ వల్ల చిన్న వయసులోనే గుండెపోటుకు బలవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. దీనికి పరిష్కారం ఆహార అలవాట్లు మార్చుకోవడమే..

 

గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే చేపలు తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారానికి రెండు, మూడుసార్లు చేపలకూర తినడం వల్ల గుండెపోటును అదుపులో ఉంచవచ్చంటున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు చేపమాంసం తరచూ తినడం వల్ల గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చు.

 

గుండెపోటు మాత్రమే కాదు.. మధుమేహం, కంటిచూపు మందగించడం లాంటి సమస్యలకు కూడా చేప మాంసం మంచి పరిష్కారం. చేపలో ఉండే ఒమేగా-3 కంటిచూపును మెరుగుపరుస్తాయి. మధుమేహం వల్ల కలిగే దుష్పలితాలను నివారించడంలో ఒమేగా ఆమ్లాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తాయి. టైప్-2 డయాబెటిస్‌లో బాధపడే వారు ఆయిలీ ఫిష్ తింటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందట.!

To Top

Send this to a friend