ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో దూకుడు మీదున్న హీరో ఎవరు అంటే ఠక్కున అల్లు అర్జున్ పేరు వినిపిస్తుంది. ఒక సినిమా తర్వాత మరోటి అంటూ బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం బన్నీ ‘డీజే’ చివరి దశ షూటింగ్లో ఉన్నాడు. నేటితో ఆ సినిమా షూటింగ్ పూర్తి కాబోతుంది. నేడు ‘డీజే’ షూటింగ్ పూర్తి అవ్వనుందో లేదో వెంటనే రేపే తన కొత్త సినిమా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రచయిత వక్కంతం వశం దర్శకత్వంలో బన్నీ తర్వాత సినిమా రేపటి నుండి సెట్స్‌పైకి వెళ్లబోతుంది.
ఇతర హీరోలు మాత్రం ఒక సినిమా చేస్తున్నప్పుడు మరో సినిమా గురించి ఆలోచించరు. ఒక సినిమా పూర్తి అయ్యి, విడుదలైన తర్వాత కొన్నాళ్లు రెస్ట్ తీసుకుని, ఆ తర్వాత మరో ప్రాజెక్ట్‌ను కమిట్ అవుతారు. ఇందుకు చాలా సమయం పడుతుంది. అందుకే ఇతర స్టార్ హీరోలు సంవత్సరంలో ఒక్కటి మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలుగుతున్నారు. సినిమాలను స్పీడ్‌గా చేసే విషయంలో అల్లు అర్జున్ను చూసి ఇతర హీరోలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక సినిమా చేస్తున్న సమయంలో మరో సినిమా చేయకున్నా, ఒక సినిమా చేస్తున్న సమయంలోనే మరో సినిమాకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవడం మంచి పద్దతి, సినిమా విడుదలైన వెంటనే మరో సినిమాను మొదలు పెట్టడం వల్ల సంవత్సరంలో రెండు సినిమాలు చేయవచ్చు. బన్నీ నటించిన ‘డీజే’ చిత్రం వచ్చే 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక వక్కంతం వంశీతో చేయబోతున్న చిత్రం ఇదే సంవత్సరం చివర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
