స్టార్‌ హీరో భార్య ఆందోళన


టాలీవుడ్‌లో ఆయనో స్టార్‌ హీరో. ఎన్నో చిత్రాలను చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాన్ని దోచుకున్నాడు. అలాంటి హీరో ఒక హీరోయిన్‌ మనస్సును కూడా దోచుకున్నాడు. ప్రస్తుతం ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నాడు. ఇద్దరి మద్య వ్యవహారం శృతిమించుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పటికే ఆ హీరోకు పెళ్లి అయ్యింది. ప్రస్తుతం ఆ హీరో గారి భార్య విషయంపై ఆందోళన చెందుతుంది.

సినిమా పరిశ్రమకే చెందిన మరో ప్రముఖ దర్శకుడు ఈ విషయమై హీరోతో మాట్లాడుతున్నాడట. ఇంత స్టార్‌ హోదా పెట్టుకుని, పెళ్లి అయిన తర్వాత ఇలా ప్రేమ అంటూ హీరోయిన్‌ను వెంటేసుకుని తిరగడం పద్దతి కాదని, ఇప్పటికైనా ఆమెను పక్కకు పెట్టి కుటుంబంను చూసుకోవాలి అంటూ దర్శకుడు సలహా ఇచ్చాడట. కాని ఆ హీరో మాత్రం ఆ దర్శకుడి మాట ఏమాత్రం లెక్క పెట్టడం లేదు. దాంతో ఆ హీరోగారి భార్య తాజాగా ఒకసారి ఆ హీరోయిన్‌తో మాట్లాడే ప్రయత్నం చేసింది. కాని ఆమె మాత్రం మాట్లాడేందుకు నిరాకరించిందట. తన భర్తను వదిలేయాల్సిందిగా హీరోయిన్‌గాను ఆమె కోరుతూ సన్నిహితుల ద్వారా సందేశం పంపింది. అయినా కూడా ఆమె మాత్రం ఇప్పటికి హీరోతోనే తిరుగుతుందనే టాక్‌ వినిపిస్తుంది.

To Top

Send this to a friend