సంఘమిత్ర పై శృతి సంచలన కామెంట్స్‌..!

తమిళంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ‘సంఘమిత్ర’ చిత్రం నుండి శృతిహాసన్‌ తప్పుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. బాహుబలి స్థాయిలో ఈ సినిమా ఉంటుందని ఆశించిన సినీ జనాలకు షాక్‌ ఇస్తూ శృతిహాసన్‌ సినిమా నుండి తప్పుకోవడంతో సినిమాపై నీళి నీడలు కమ్ముకుంటున్నాయి. అసలు సినిమా మొత్తం షూటింగ్‌ పూర్తి అవుతుందా, షూటింగ్‌ పూర్తి అయినా సినిమా ఆడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తాజాగా శృతిహాసన్‌ సినిమా నుండి బయటకు వచ్చిన ముద్దుగుమ్మ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. దర్శకుడు ఒక గొప్ప ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాం, అద్బుతంగా చేద్దాం అంటారు తప్ప, అసలేం చేయాలి, ఎలా చేయాలి అనేది ఆయనకే క్లారిటీ లేదు. ఇప్పటి వరకు స్క్రిప్ట్‌ పూర్తిగా రెడీ కాలేదు. షూటింగ్‌ స్టార్ట్‌ చేసి స్క్రిప్ట్‌ను పూర్తి చేద్దాం అంటాడు. అలా చేయడం వల్ల షూటింగ్‌ అడ్డదిడ్డంగా జరుగుతుంది. అనుకున్నదాని కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశాలున్నాయి. టెక్నీషియన్స్‌ మరియు నటీనటులు ఎక్కువ వర్క్‌ చేయాల్సి ఉంటుంది. అందుకే తాను సినిమా నుండి బయటకు వెళ్లినట్లుగా ఆమె సన్నిహితుల వద్ద చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

శృతిహాసన్‌ స్థానంను హన్సిక లేదా మరో హీరోయిన్‌తో భర్తీ చేసేందుకు దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. దర్శకుడు శృతిహాసన్‌ ఎందుకు తప్పుకుంది అనే విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఆమెకు ఇతర కమిట్‌మెంట్స్‌ ఉండటం వల్ల తప్పుకుందని మాత్రం నిర్మాణ సంస్థ ప్రకటించింది. మొత్తానికి ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఈ సినిమాకు ఆరంభంలోనే అడ్డంకులు వస్తున్నాయి. సినిమా కొస ఎల్లేనా అనేది చూడాలి.

To Top

Send this to a friend